18శాతం జీఎస్టీ రద్దు చేయాలి
వేలూరు: వ్యాపారులపై కేంద్ర ప్రభుత్వం విధించిన 18 శాతం జీఎస్టీని రద్దు చేయాలని కోరుతూ తమిళనాడు అన్ని వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో వేలూరు అన్నారోడ్డులో ధర్నా నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నాలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జ్ఞానవేల్ అధ్యక్షతన ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ఉన్న ఫలంగా గత అక్టోబర్ 10వ తేదీ నుంచి వ్యాపార దుకాణాలకు 18 శాతం జీఎస్టీ విధించడం సరికాదన్నారు. వీటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చిన్న, పెద్ద వ్యాపారులందరికీ ఒకే విధంగా పన్నులు విధించడం వల్ల వ్యాపారులు పూర్తిగా నష్టపోతున్నామని ఆరోపించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నాలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి ఏవీఎం కుమార్, జిల్లా కోశాధికారి అమిన్ అహ్మద్ ఆలీయార్, యువజన విబాగం కార్యదర్శి అరుణ్, వ్యాపారుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment