చక్కెర ఫ్యాక్టరీ ఆధునీకరణకు చర్యలు
తిరుత్తణి: తిరుత్తణి సహకార చక్కెర ఫ్యాక్టరీ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామని మంత్రి రాజేంద్రన్ రైతులకు హామీ ఇచ్చారు. తిరువలంగాడులోని తిరుత్తణి సహకార చక్కర ఫ్యాక్టరీ వుంది. ఇందులో వెయ్యిమంది చెరుకు రైతులు సభ్యులుగా వున్నారు. గత 40 ఏళ్ల కిందట ప్రారంభించిన చక్కెర ఫ్యాక్టరీలోని యంత్రాలు మరమ్మతులు కావడంతో క్రషింగ్ సామర్థ్యం తగ్గి ప్రతిఏటా ఫ్యాక్టరీకి భారీగా నష్టం చోటుచేసుకుంటోంది. ఫ్యాక్టరీని ఆధునీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు చాలా కాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఈక్రమంలో టూరిజం, చక్కెర శాఖమంత్రి రాజేంద్రన్ బుధవారం తిరుత్తణి సహకార చక్కెర ఫ్యాక్టరీని తనిఖీ చేశారు. యంత్రాలను పరిశీలించి పనితీరుపై అధికారుల వద్ద వివరాలు సేకరించారు. అనంతరం కార్యాలయంలో రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సూచనలు, సలహాలు స్వీకరించారు. మంత్రి మాట్లాడుతూ చెరుకు రైతుల సూచన మేరకు చక్కెర ఫ్యాక్టరీలో కొత్త యంత్రాలు తీసుకొస్తామని, రైతులు చెరుకు పంట దిగుబడి పెంచి లాభాలు పొందే విధంగా సాగు చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయశాఖ కమిషనర్ అపూర్వ, చక్కెర శాఖ డైరెక్టర్ జయకాంతన్, కలెక్టర్ ప్రభుశంకర్, ఎమ్మెల్యేలు చంద్రన్. రాజేంద్రన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment