కరుణ రచనలు.. జాతీయమయం
● ఉత్తర్వులను అందుకున్న రాజాత్తి అమ్మాల్
సాక్షి, చైన్నె: డీఎంకే దివంగత అధినేత కరుణానిది రచనలు, పుస్తకాలు, గ్రంథాలు, కవితలన్నీ జాతీయమయం చేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. దీనిని కరుణానిధి మరో సతీమణి రాజాత్తి అమ్మాళ్ ఆదివారం అందుకున్నారు. వివరాలు.. కలైంజ్ఞర్ కరుణానిధి రచయిత అన్న విషయం తెలిసిందే. ఆయన ఎన్నో రచనలు, నాటకాలు, సినిమాలకు కథలు రాశారు. అంతేకాదు మురసోలి పత్రిక వేదికగా మరెన్నో సంపాదకీయాలు, కేడర్‌కు లేఖాస్త్రాలు సంధించారు. ఇలా ఆయన రాసిన ప్రతి రచనను జాతీయమయం చేయడానికి డీఎంకే ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సీఎం స్టాలిన్ జారీ చేశారు. తమిళాభివృద్ధి, సమాచార శాఖ నేతృత్వంలో ఈ ఉత్తర్వులను జారీ చేశారు. కరుణానిధి రచనలు జాతీయమయం చేస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఉత్తర్వుల ధృవీకరణ పత్రాన్ని ఆదవారం ఆయన మరో సతీమణి రాజాత్తిఅమ్మాళ్‌కు తమిళాభివృద్ధి శాఖ మంత్రి స్వామినాథన్ అందజేశారు. ఈ సందర్భంగా కరుణానిధి గారాల పట్టి, ఎంపీ కనిమొళి వెన్నంటి ఉన్నారు. ఈ కార్యక్రమంలో తమిళాభివృద్ధి శాఖ అధికారులు రాజారామన్, అరుల్ పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి స్వామినాధన్ మాట్లాడుతూ, 179 వివిధ అంశాల రచనలతో కూడిన పుస్తకాలు, మరెన్నో అంశాలతో కూడిన సంపాదకీయాలు, మురసోలిలో రాసిన వ్యాసాలు, కేడర్‌కు పంపిణీ లేఖలు ఇలా అన్నింటినీ జాతీయమయం చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment