కారు ఢీకొని కార్మికుడి మృతి
సేలం: సేలం, అయోధ్య పట్టణం సమీపంలోని పెరియ కౌండాపుదూర్‌కు చెందిన తంగవేల్ (55) మీనాంపల్లిలో ఉన్న ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో తోట కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈయన శనివారం సాయంత్రం మిన్నాంపల్లి ప్రాంతంలో సేలం–చైన్నె జాతీయ రహదారిని టీవీఎస్ ఎక్స్‌ఎల్ బైక్‌పై దాటడానికి ప్రయత్నించాడు. సరిగ్గా అదే సమయంలో సేలం నుంచి వాళప్పాడి వైపుగా డ్రైవర్ అన్నాదురై (55) నడిపిన మహీంద్ర స్కార్పియో కారు దూసుకువచ్చి తంగవేల్ బైక్‌ను వేగంగా ఢీకొంది. దీంతో ఎగిరి పడిన తంగవేల్ తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే మరణించాడు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న కారిపట్టి పోలీసులు తంగవేల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవంపచనామా నిమిత్తం సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కేసు నమోదు
పోలీసుల విచారణలో... కారు సేలం పనమరత్తుపట్టి అన్నాడీఎంకే చైర్మన్ జగన్నాథన్‌కు చెందినదని తెలిసింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామి వెళ్తున్న కాన్వాయ్ కార్లకు కొంత వెనుకగా కారులో వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించిందని తెలిసింది. పోలీసులు జగన్నాథన్ కారు డ్రైవర్ అన్నాదురైపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment