ఘనంగా ఎంసీటీబీసీ వార్షికోత్సవం
● ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
కొరుక్కుపేట: చైన్నె వేపెరిలోని మద్రాసు సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ సంఘం(ఎంసీటీబీసీ) 146వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. చర్చి ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకలకు సంఘ కాపరి డాక్టర్ ఎస్ రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు. ముందుగా ప్రత్యేక ప్రార్థనతో ప్రారంభమైన ఈ వేడుకల్లో రిటైర్డ్ రెవరెండ్ డాక్టర్ ఆర్‌కే ఏబేల్ నీలకంఠన్ పాల్గొని దైవ సందేశాన్ని అందించారు. దేవునికి ఇష్టమైన రీతిలో నడుచుకోవాలని ఉపదేశించారు. ఆత్మీయ అతిథులుగా అంతర్జాతీయ ప్రసంగీకులు రెవరెండ్ ప్రకాష్ రాజ్, టామ్స్ వ్యవస్థాపకుడు గొల్లపల్లి ఇశ్రాయేలు, టామ్స్ అధ్యక్షుడు విజయకుమార్ పాల్గొని, తల్లి సంఘంగా ఘనమైన చరిత్ర కలిగిన ఎంసీటీబీసీ 146వ వార్షికోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ చర్చి మరిన్ని వార్షికోత్సవాలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అతిథులను శాలువాలు, జ్ఞాపికలతో సంఘ కార్యవర్గం ఘనంగా సత్కరించింది. వార్షిక నివేదికను సంఘ కార్యదర్శి పోతల ప్రభుదాసు సమర్పించారు. సంఘ కాపరి రాజేంద్రప్రసాద్ దంపతులను సంఘ అధ్యక్షుడు జి.రామయ్య, సెక్రటరీ పోతల ప్రభుదాసు, ట్రెజరర్ ఐ.మార్క్ ఘనంగా సత్కరించారు. వేడుకలో సహోదరి యం.సౌదామిని, ఎన్.ప్రసన్న కుమార్, పి.అరుణ కుమారితోపాటు సీ్త్రల సమాజం సభ్యులు, యవ్వనస్తులు పలు భక్తిగీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో భక్తిభావాన్ని చాటుకున్నారు. అందరికీ ప్రేమవిందును అందించారు.
Comments
Please login to add a commentAdd a comment