సీసీ కెమెరాల పాత్ర కీలకం
తిరువళ్లూరు: వేర్వేరు కేసుల్లో నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఊత్తుకోట డీఎస్పీ శాంతి తెలిపారు. తిరువళ్లూరు జిల్లా ఎల్లాపురం యూనియన్ కన్నిగైపేర్ గ్రామంలోని సీఎస్‌ఐ నగర్, కృష్ణాపురం, కండ్రిగ తదితర ప్రాంతాల్లో 15 లక్షల వ్యయంతో 58 సీసీ టీవీ కెమెరాలను గ్రామస్తులు ఏర్పాటు చేశారు. దీంతో పాటు గ్రామంలో పోలీసు హెల్ప్‌సెంటర్ భవన నిర్మాణ పనులు సైతం పూర్తయ్యాయి. గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, పోలీసు హెల్ప్ సెంటర్‌ను ప్రారంభించే కార్యక్రమం ఆదివారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమానికి పంచాయతీ అధ్యక్షురాలు గాయత్రి ఉదయకుమార్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా డీఎస్పీ శాంతి హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా డీఎస్పీ శాంతి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్‌లోనూ సిబ్బంది కొరత ఉంది. అయితే సిబ్బంది కొరత ఉన్నా పలు నేరాలు, చోరీల్లో నిందితులను సులభంగా గుర్తిసున్నాం. ఇందుకు వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలే సహాయపడుతున్నాయని వ్యాఖ్యానించారు. గ్రామాల్లో ప్రజలకు పోలీసులకు మధ్య సత్ససంబంధాలు పెరగాలని, పోలీసులు సైతం ప్రజలతో స్నేహపూరిత వాతావరణాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇబ్బందులు కలిగితే నేరుగా పోలీసు స్టేషన్‌కు వచ్చి నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని కూడా సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపాళ్యం ఇన్‌స్పెక్టర్ పద్మశ్రీ బబ్బి, ఎల్లాపురం డీఎంకే కార్యదర్శి శక్తివేల్, పంచాయతీ ఉపాధ్యక్షురాలు మేనకసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment