గ్లెనెగల్స్‌లో ఆస్తమా కేర్ అడ్వాన్స్‌డ్ సెంటర్
సాక్షి, చైన్నె: గ్లెనెగల్స్‌లో అస్తమా కేర్ కోసం అడ్వాన్స్‌డ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీనిని ఆదివారం జరిగిన కార్యక్రమంలో సహకార, ఆహారం , వినియోగదారుల శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్, గ్లెనీగల్స్ సీఈఓ నాగేశ్వర్ రావు, క్లినికల్ లీడ్ కన్సల్టెంట్ డాక్టర్ సురేష్ సహదేవన్ ప్రారంభించారు. తీవ్రమైన ఆస్తమాతో బాధపడుతున్న రోగులకు సమగ్ర సంరక్షణను అందించడమే లక్ష్యంగా ఈ సెంటర్ ఏర్పాటు చేశామని సురేష్ సహదేవన్ వివరించారు. సంపూర్ణ సంరక్షణ కోసం పల్మోనాలజిస్ట్‌లు, అలెర్జిస్ట్‌లు , రెస్పిరేటరీ థెరపిస్ట్‌లతో కూడిన మల్టీడిసిప్లినరీ విధానాన్ని ఈ సెంటర్ కలిగి ఉంటుందన్నారు. ఉబ్బసం తీవ్రతను నిర్ధారించడానికి, వర్గీకరించడానికి అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉందన్నారు. చైన్నెలో అధిక కాలుష్య స్థాయి, తేమ, ఇతర పర్యావరణ కారకాల వల్ల తీవ్రమైన ఉబ్బసం సవాళ్లు తీవ్ర మవుతున్నాయని వివరించారు. ఇది సమర్థమైన నిర్వహణను గతంలో కంటే చాలా క్లిష్టమైనదిగా చేస్తుందని చెప్పారు. ఈ సవాలును ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈసెంటర్ ఏర్పాటు చేశామన్నారు. స్లీప్ మెడిసిన్ హెడ్ – ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ అపర్ జిందాల్, సీఈఓ నాగేశ్వర్ రావు మాట్లాడుతూ, ఆరోగ్య సంరక్షణలో అత్యుత్తమ డ్రైవింగ్‌కు కట్టుబడి ఉన్నామని, ఆస్తమా క్లినిక్ కోసం అడ్వాన్స్‌డ్ సెంటర్‌ను ప్రారంభించడం అధునాతన చికిత్సలు మెరుగుపరచడంలో మా అంకితభావానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment