విజయ్‌కి అది చివరి చిత్రం కాదా?
తమిళసినిమా: సినిమా ఎవరినీ అంత సులభంగా వదిలిపెట్టదు. ఉన్నత స్థాయిలో ఉన్న వారిని అస్సలు వదిలి పెట్టదు.వారికీ విడనాడటానికి మనసు అంగీకరించదు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే. నటుడు విజయ్ గురించి పరిచయం అవసరం ఉండదు. కోలీవుడ్‌లో టాప్‌స్టార్ ఈయన. ఆ మధ్య తెలుగులోనూ వారీసు చిత్రం ద్వారా ప్రేక్షకులను నేరుగా పలకరించారు. ఇకపోతే ఈయన ప్రస్తుతం తన 69వ చిత్రంలో నటిస్తున్నారు. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటి పూజాహెగ్డే నాయకిగా నటిస్తోంది. బీస్ట్ చిత్రం తరువాత ఈ జంట కలిసి నటిస్తున్న రెండో చిత్రం ఇది. కాగా ఇప్పటికే రాజకీయ రంగప్రవేశం చేసి తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని ప్రారంభించిన విషయం తెలిసిందే. 2026లో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నారు. దీంతో నటనకు స్వస్తి చెప్పనున్నట్లు, ప్రస్తుతం నటిస్తున్న చిత్రమే చివరిదని ప్రచారం జరుగుతోంది. అలాంటిది తాజాగా విజయ్ మరో చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇకపోతే ఈయన ఇంతకు ముందు గోట్ అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. వెంకట్‌ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకున్నా, వసూళ్ల పరంగా పెద్ద మొత్తాన్ని సాధించింది. కాగా విజయ్ ప్రస్తుతం నటిస్తున్న ఆయన 69వ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరో రెండు నెలల్లో షూటింగ్ పూర్తి అవుతుందని సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే దీపావళి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇకపోతే నటుడు విజయ్‌కు చాలా మంది దర్శకులు కథలు చెప్పారు. అదే విధంగా తెలుగులో బాలకృష్ట నటించిన భగవంత్ కేసరి చిత్ర రీమేక్‌లో విజయ్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తన చివరి చిత్రం స్టైయిట్ కథా చిత్రం కావాలని విజయ్ భావిస్తున్నట్లు టాక్. దీంతో దర్శకుడు వెంకట్‌ప్రభునే మంచి కథను సిద్ధం చేయమని చెప్పినట్లు తాజా సమాచారం. అదే విధంగా వెంకట్‌ప్రభు కథను వండే పనిలో ఉన్నట్లు తెలిసింది. మొత్తం మీద విజయ్ 70వ చిత్రానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా గోట్ కాంబో రిపీట్ కాబోతుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం.
విజయ్‌తో దర్శకుడు వెంకట్‌ప్రభు
Comments
Please login to add a commentAdd a comment