యురోగైనకాలజీ సేవలకు ప్రత్యేక విభాగం
● ప్రారంభించిన నటి పూర్ణిమా భాగ్యరాజ్
సాక్షి, చైన్నె: మహిళలకు వచ్చే ఆరోగ్య సమస్యలకు చికిత్స అందించే విధంగా అధునాతన యురో గైనకాలజీ వైద్య విభాగాన్ని సవీత వైద్య కళాశాలలో ఏర్పాటు చేశారు. దీనిని సోమవారం సినీ నటి పూర్ణిమా భాగ్యరాజ్ ప్రారంభించారు. ఇటీవల కాలంగా మహిళలు, యువతులు ఎదుర్కొంటున్న ఆరోగ్య పరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని, సాంప్రదాయక నాన్–సర్జికల్ థెరపీలు, మినిమల్లీ ఇన్వాసివ్ సర్జికల్ విధానాలతో సహా అధునాతన డయాగ్నోస్టిక్స్, సమగ్ర సంరక్షణను అందించే విధంగా ఈ విభాగాన్ని తీర్చిదిద్దారు. ఈ విభాగం స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌గా, పెల్విక్ ఫ్లోర్ డిజార్డర్స్ ఉన్న మహిళలకు శస్త్రచికిత్స, నాన్–సర్జికల్ కేర్ యూనిట్‌గా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమా భాగ్యరాజ్, మద్రాసు మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ రాజమహేశ్వరి, సవీత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు డాక్టర్ వీరయ్యన్, ప్రో చాన్స్‌లర్ డాక్టర్ దీపక్ నల్లసామి, డీన్ డాక్టర్ జె.కుముద, యూరోగైనకాలజీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ కె.సీతాలక్ష్మి, ఎస్‌ఎంసీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పొన్నంబలం తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వీరయ్యన్ మాట్లాడుతూ హైపర్ టెన్షన్, డయాబెటిస్ మెల్లిటస్, డిప్రెషన్ కంటే పెల్విక్ ఫ్లోర్ పరిస్థితులు సర్వసాధారణంగా ప్రస్తుతం మారిందన్నారు. 10 మంది వయోజన మహిళల్లో ఒకరికి మధుమేహం, ముగ్గురిలో ఒకరికి హైపర్‌టెన్షన్, ఇరవై మందిలో ఒకరు డిప్రెషన్‌తో బాధపడుతుండగా, ఇద్దరు వయోజన మహిళల్లో ఒకరు పెల్విక్ ఫ్లోర్ డిస్‌ఫంక్షన్‌తో బాధపడుతున్నారని వివరించారు. ఇలాంటివి చాలా సాధారణమైనప్పటికీ, ఈ సమస్యలకు ఇలాంటి పేరు అన్నది కూడా ఉందని అనేకమంది మహిళలకు తెలియదన్నారు. ఈ పరిస్థితుల్లో పెల్విక్ ఫ్లోర్ డిజార్డర్స్ ఉన్న మహిళలకు అద్భుతమైన, కరుణా హృదయంతో అత్యాధునిక సంరక్షణను అందించడానికి ఈ ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment