300 సవర్ల నగలు ధరించి..
సేలం: 300 సవర్ల నగలు ధరించి కొడివెరి జలపాతంలో జలకాలాడిన చైన్నె వ్యాపారవేత్తను పోలీసులు మందలించి పంపిన ఘటన ఆదివారం కలకలం రేపింది. పొంగల్ పండుగ సెలవుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పర్యాటక ప్రాంతాలు జన రద్దీతో కిటకిటలాడాయి. ఈక్రమంలో ఈరోడ్ జిల్లా గోపిచెట్టి పాళయం సమీపంలో ఉన్న కొడివెరి జలపాతం వద్ద కూడా పర్యాటకుల సందడి నెలకొంది. కొడివెరి జలపాతం వద్దకు ఈరోడ్, తిరుపూర్, కోవై, సేలం, మదురై, ధర్మపురి, తంజావూరు వంటి పలు జిల్లాలో నుంచి, కర్ణాటక రాష్ట్రం మైసూరు, బెంగుళూరు నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు.
వీడియో వైరల్..
ఈ క్రమంలో అక్కడికి ఒక వ్యక్తి 300 సవర్ల బంగారు నగలు ధరించి వచ్చాడు. దీంతో సందర్శకులు అందరూ ఆయన్నే చూడడం కలకలం రేపింది. ఈ విషయం తెలిసి పదుల సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ వ్యక్తి జలపాతం వద్ద స్నానం చేయడానికి వెళ్లి చాలా సేపటి వరకు రాకపోవడంతో పోలీసులు ఆయన్ని బయటకు రప్పించి విచారించారు. అప్పుడు ఆ వ్యక్తి చైన్నె పల్లావరంకు చెందిన అన్నాడీఎంకే నాయకుడు విజయ్ అని, పొంగల్ పండుగ సందర్భంగా కుటుంబంతో వచ్చినట్టు తెలిసింది. దీంతో పోలీసు అధికారులు భద్రత నిమిత్తం విజయ్‌ను అక్కడి నుంచి కుటుంబంతో పాటూ పంపించివేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
కొడివెరి జలపాతంలో జలకాలు
చైన్నె వ్యాపారవేత్తను మందలించి
పంపిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment