● 470 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న విమానాశ్రయ కమిటీ
సేలం: కోవై విమానాశ్రయ విస్తరణ పనులు కోసం రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఇచ్చిన 470 ఎకరాల భూమిని విమానాశ్రయ కమిటీ పొందింది. కోవై విమానాశ్రయం నుంచి చైన్నె, ముంబై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, పూణే, గోవా వంటి దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు 32 విమానాలు పయణిస్తున్నాయి. ఇదేవిధంగా సింగపూర్‌కు రెండు విమానాలు, షార్జాకు వారానికి 5 విమానాలు, అబుదాబికి వారానికి 3 ట్రిప్పులు విమానాలు నడుపుతున్నారు. కోవై విమానాశ్రయాన్ని ఉపయోగించుకునే ప్రయాణికుల సంఖ్య మాత్రమే కాకుండా సరకు రవాణా కూడా రోజు రోజుకు పెరిగిపోతోంది. కోవై నుంచి విమానంలో ప్రయాణించే వారి సంఖ్య 2021లో 1,273,520 మంది కాగా, 2022లో 2,309,525 మంది, 2023లో 2,886,533 మంది, 2024లో 3,063,878 మందికి పెరిగింది. దీంతో విమానాశ్రయాన్ని విస్తరించాలని ప్రయాణికులు, వ్యాపార సంస్థలు కోరుతున్నారు.
వేగం పుంజుకున్న పనులు..
ఈ విమానాశ్రయాన్ని విస్తరించడం కోసం భూమి స్వాధీనం చేయడానికి 2010 సంవత్సరం ప్రభుత్వం సింగానల్లూర్, ఉప్పిలిపాళయం, కాళప్పటి, నీలాంపూర్, ఇరుగూర్ వంటి గ్రామాలలో 627.89 ఎకరాల భూమిని స్వాధీనం చేయడానికి నిర్ణయించింది. ఆ తర్వాత పలు కారణాల వల్ల ఆ పనులు నత్తనడక సాగాయి. ప్రస్తుతం ఈ పనులు వేగం పుంజుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ. 2088 కోట్ల నిధిని కేటాయించి, భూ యజమానులకు నష్ట పరిహారం అందజేసి 451.74 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. దీంతోపాటు 20.58 ఎకరాల పోరంబోకు భూమితో కలిపి మొత్తం 472.32 ఎకరాల భూమిని ఎలాంటి నిబంధనలు లేకుండా 99 సంవత్సరాలు లీజ్‌కు గత ఏడాది ఆగస్టులో విమానాశ్రయానికి అప్పగించింది. ఇదివరకే ఈ భూమిలో 148.39 ఎకరాల భూమిని విమానాశ్రయ విస్తరణ పనులు చేయవచ్చని ఆ శాఖ తరపున ఎన్‌ఓసీ కూడా అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అప్పగించిన భూముల్లో 449.59 ఎకరాల పట్టా భూమి, 20.58 ఎకరాల పురంబోకు భూమితో కలిపి మొత్తం 470 ఎకరాలు భూమిని పలు నెలలకు తర్వాత విమానాశ్రయ కమిటీ ఇప్పుడు పొందింది. ఈ భూములను విమానాశ్రయ కమిటీ వ్యాల్యువేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. విమానాశ్రయ విస్తరణకు అవసరమైన మిగిలిన భూమిని కూడా స్వాధీనం చేసుకునే పనులను కమిటీ వేగవంతం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment