సేలం : చైన్నె, కోయంబేడు బస్టాండ్ నుంచి శుక్రవారం సాయంత్రం కనయాకుమారి జిల్లా, మార్తాండం వైపుగా ఓ ప్రైవేటు ఓమ్ని బస్సు బయలుదేరింది. ఆ బస్సులో ఇద్దరు డ్రైవర్లు, 39 మంది ప్రయాణికులు సహా మొత్తం 41 మంది ఉన్నారు. ఈ బస్సు అర్ధరాత్రి తిరుచ్చి జిల్లా తువరంకురిచ్చి సమీపంలో తిరుచ్చి – మదురై జాతీయ రహదారిపై యాగాపురం వద్ద వెళుతూ ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీకొని సుమారు 15 అడుగుల పల్లంలో పడిపోయింది. ఆ సమయంలో బస్సుకు నిప్పు అంటుకుంది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు గావుకేకలు పెట్టారు. దీన్ని గమనించి ఆ మార్గంలో వెళుతున్న ఇతర వాహనదారులు గమనించి బస్సులో ఉన్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రెండు గంటల పాటు శ్రమించి మంటరు ఆర్పారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా గాలిపోయింది. బస్సు విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఆ ప్రాంతంలో విద్యుత్ పవర్ నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కన్యాకుమారి జిల్లా కలియకావిలై నెడువిలై ప్రాంతానికి చెందిన ప్రయాణికురాలు పుష్పా (62), బస్సు డ్రైవర్లు రాజా, బాబుతో పాటూ 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పుష్పా శనివారం మధ్యాహ్నం మృతి చెందింది. ఈ ప్రమాదం కారణంగా చైన్నె – మదురై జాతీయ రహదారిపై రెండు గంటల పాటూ ట్రాఫిక్ స్తంభించింది.
మంటలంటుకుని మహిళ సజీవ దహనం
11 మంది గాయాలు
Comments
Please login to add a commentAdd a comment