తిరువొత్తియూరు: సెంజి సమీపంలో మహిళపై బలాత్కారం కేసులో ముగ్గురికి 20 సంవత్సరములు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. విలుపురం జిల్లా సంజీ సమీపంలో కోనై గ్రామానికి చెందిన రంజిత్ కుమార్ (27), చక్ర పురముకు చెందిన దురై (30), సిరు కడంబుర్‌కు కుబేరన్ (32) వీరు ముగ్గురు గత 2017 ఆగస్టు 25వ తేదీ అదే ప్రాంతానికి చెందిన మానసిక రుగ్మత కలిగిన మహిళను వాణిజ్య కాంప్లెక్స్ వెనకకు తీసుకువెళ్లి బలాత్కారం చేశారు. దీని గురించి ఫిర్యాదు మేరకు సెంజి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. రంజిత్ కుమార్, దురై, కుబేరన్ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ విలుపురం ఎస్సీ, ఎస్టీ కేసులు విచారణ చేసే ప్రత్యేక కోర్టులో విచారణ సాగింది. న్యాయమూర్తి భాగ్యజ్యోతి శుక్రవారం తుది తీర్పు చెప్పారు ఇందులో రంజిత్ కుమార్, దురై కుబేరన్ పై నేరారోపణ నిర్ధారణ కావడంతో ముగ్గురికి 20 ఏళ్లు జైలు శిక్ష, ఒక్కొక్కరికి తలా రూ. 1. 20 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. దీంతో దోషులు ముగ్గురిన కడలూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment