‘హాయ్ ఏంటి నీ న్యూ ఇయర్ ప్లాన్?’ అంటూ పరస్పరం ప్రశ్నల పరంపర సిటీలో జోరందుకుంది. అప్పటి దాకా ఏ ప్లాన్ లేని వారిని కూడా ఆ ప్రశ్న నిద్రలేపుతోంది. ‘మా ఇంటికి దగ్గర్లోనే మా క్లబ్ ఉంది. ఏటా మా ఫ్యామిలీ అక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం...ఈ ఇయర్ కూడా అంతే’ అంటూ సింపుల్‌గా తేల్చి చెప్పేసే నిజాం, సికింద్రాబాద్ క్లబ్‌ల వంటి క్లబ్‌ల సభ్యులతో పాటు... ‘ఎవ్విరి ఇయర్ డిఫరెంట్ స్టైల్ ట్రై చేస్తా. ఈ సారి ఓ రివర్ సైడ్ స్టే టెంట్స్‌లో ప్లాన్ చేశా’ అంటూ చెప్పే కార్పొరేట్ ఉద్యోగులకూ కొదవలేదు.
వేడుకలకు తెరతీసే వేడుక...
హైదరాబాద్ లాంటి మహానగరాల్లో పార్టీ కల్చర్ విడదీయలేని భాగం. దాదాపు ఏడాది మొత్తం పారీ్టలకు సై అనే జోష్ వయసులకు అతీతంగా సిటిజనుల్లో కనపడుతుంది. అందునా... ఏడాది ప్రారంభంలో వచ్చే సందడి, పార్టీలకు పెద్దన్న లాంటి న్యూ ఇయర్ పార్టీని దాదాపుగా పార్టీ లవర్స్ ఎవరూ మిస్ కారు. ‘మన హ్యాపీనెస్‌ని షేర్ చేసుకోవడానికి ఫ్రెండ్స్, ఫ్యామిలీ కలిసి చేసుకునే మిగిలిన పారీ్టస్‌తో పోలిస్తే ఇది డిఫరెంట్. దాదాపుగా ప్రపంచం అంతా మనతో కలిసి చేసుకునే ఫెస్టివల్ ఇదొక్కటే’ అని నగరానికి చెందిన ఐటీ ఉద్యోగి హర్ష చెప్పారు.
ఫ్యామిలీస్‌తో వెళితే అలా... ఫ్రెండ్స్‌తో అయితే లలలా...
నగరంలో కుటుంబ సమేతంగా న్యూ ఇయర్ వేడుకల్ని జరుపుకునేవారు తమకు సభ్యత్వాలున్న క్లబ్స్, ఫార్మ్ హౌస్‌లు, లేదా మరికొన్ని కుటుంబాలతో
ఎవరో ఒక ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడం వంటివి చేస్తున్నారు. అదే ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేసేవారు ఎక్కువగా ఓపెన్ ఎయిర్ పార్టీలు, పబ్స్ వగైరాలను సెలక్ట్ చేసుకుంటుంటే, ప్రేమికులు మాత్రం రిసార్ట్స్, శివార్లలో జరిగే ఈవెంట్స్‌ని ఎంచుకుంటున్నారు.
హనీమూన్‌తో పాటే...
ఓ వైపు కార్తీక మాసంలో భారీ స్థాయిలో నగరంలో పెళ్లిళ్లు జరిగాయి. ప్రస్తుతం మాఘమాసం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. దీంతో పలు కొత్త జంటలు న్యూ ఇయర్ వేడుకలకు పేరొందిన ప్లేస్‌లకు హనీమూన్స్ ప్లాన్ చేసుకున్నారు. ‘రీసెంట్‌గా మ్యారేజ్ అయింది. దాంతో అటు న్యూ ఇయర్ కూడా కలసి వచ్చేలా హనీమూన్ ప్లాన్ చేశాం. ప్రస్తుతం మేం ఇటలీలో ఉన్నాం. ఓ వారం ముందు నుంచే ఫుల్ జోష్ నడుస్తోంది ఇక్కడ’ అంటూ నగరానికి చెందిన సినీ నటి శ్రావ్య ఫోన్‌లో ‘సాక్షి’కి చెప్పారు. పెళ్లయిన వారు అనే కాకుండా చాలా మంది ఇప్పటికే నగరం నుంచి విభిన్న ప్రాంతాలకు, ఊర్లకు బయలుదేరి వెళ్లారు. డెస్టినేషన్ పారీ్టస్ చేసుకునే ఉద్దేశ్యంతో కొందరు స్వస్థలాల్లో తమ వారితో కలిసి నూతన సంవత్సర వేడుకలు చేసుకోవాలని ఆశతో మరికొందరు ఉన్నారు. ఇక అందరూ స్వాగత వేడుకను సంతోషభరితంగా సురక్షితంగా జరపుకోవాలని కోరుకుందాం.
శృతిమించొద్దు!
సాక్షి, హైదరాబాద్: ‘డిసెంబర్ 31’ని జీరో ఇన్సిడెంట్..జీరో యాక్సిడెంట్ నైట్‌గా చేయడానికి పోలీసు విభాగం కసరత్తు పూర్తి చేసింది. న్యూ ఇయర్
పారీ్టల విషయంలో సభ్యత, భద్రత మరువద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇతరులకు ఇబ్బంది కలుగకుండా వీటిని నిర్వహించుకోవాలని చెబుతున్నారు. సాధారణ సమయాల్లో హోటళ్లు, పబ్స్, క్లబ్స్‌ను రాత్రి 12 వరకే తెరిచి ఉంచాలి. అయితే న్యూ ఇయర్ పారీ్టల నేపథ్యంలో ఒక గంట అదనంగా అనుమతించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి ఒంటి గంట తర్వాత ఏ కార్యక్రమం కొనసాగకూడదని స్పష్టం చేస్తున్నారు. ఒంటి గంటకు మూతపడాలంటే యాజమాన్యాలు 12.30 గంటల నుంచే కస్టమర్లను సన్నద్ధం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. డిసెంబర్ 31 రాత్రి పారీ్టలకు సంబంధించి పోలీసుల మార్గదర్శకాలివీ.
► కార్యక్రమాలకు వచ్చే ఆరి్టస్టులు, డీజేలకూ నింధనలున్నాయి. వీరి వస్త్రధారణ, హావభావాలు, పాటలు తదితరాల్లో ఎక్కడా అశ్లీలం, అసభ్యతలకు తావుండకూడదు.
► అక్కడ ఏర్పాటు చేసే సౌండ్ సిస్టం నుంచి వచ్చే ధ్వని తీవ్రత 45 డెసిబుల్స్ మించకూడదు. ఇళ్లు, అపార్ట్‌మెంట్స్‌లో వ్యక్తిగత పారీ్టల నిర్వహిస్తున్న వాళ్లూ పక్కవారికి ఇబ్బంది లేకుండా సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలి.
► న్యూ ఇయర్ కార్యక్రమాల్లో ఎక్కడా మాదకద్రవ్యాల వినియోగానికి తావు లేకుండా చూడాలి. వీటిని సేవించి వచ్చే వారినీ హోటల్స్, పబ్స్ నిర్వాహకులు రానివ్వొద్దు.
► యువతకు సంబంధించి ఎలాంటి విశృంఖలత్వానికి తావు లేకుండా, మైనర్లు పారీ్టలకు రాకుండా నిర్వాహకులు చూసుకోవాలి.
► బౌన్సర్లు అతిగా ప్రవర్తించినా, ఆహూతులకు ఇబ్బందులు కలిగించినా వారితో పాటు ఏర్పాటు చేసిన సంస్థల పైనా చర్యలు తప్పవు.
► నిబంధనల పర్యవేక్షణ, నిఘా కోసం 150 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. వీరు కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో తనిఖీలు చేయడం, వాటిని చిత్రీకరించడం, ఆడియో మిషన్ల సాయంతో శబ్ధ తీవ్రతనూ కొలుస్తారు.
► పోలీసులు నెక్లెస్‌రోడ్, కేబీఆర్ పార్క్‌రోడ్, బంజారాహిల్స్ రోడ్ నెం.1, 2, 45, 36లతో పాటు జూబ్లీహిల్స్ రోడ్‌నెం. 10, సికింద్రాబాద్, మెహదీపట్నం, గండిపేట దారుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ రేసులు, డ్రంకన్ డ్రైవింగ్ పైనా కన్నేసి ఉంచుతారు.
► బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చడం నిషిద్ధం. వాహనాల్లో ప్రయాణిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చేస్తే చర్యలు తప్పవు. వాహనాలు టాప్స్, డిక్కీలు ఓపెన్ చేసి డ్రైవ్ చేయడం, కిటికీల్లోంచి టీజింగ్ చేయడం వంటిని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తారు. ఈసారి మద్యంతో పాటు డ్రగ్స్ తీసుకున్న వారినీ గుర్తించడం కోసం ప్రత్యేక ఉపకరణాలు వాడుతున్నారు.
‘సాగర్’ చుట్టూ నో ఎంట్రీ...
కొత్త సంవత్సర వేడుకలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించామన్నారు. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు ఎనీ్టఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్‌లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించామన్నారు. ప్రత్యామ్నాయాలు లేని బేగంపేట, లంగర్‌హౌస్, డబీర్‌పుర ఫ్లైఓవర్ల మినహా మిగిలిన అన్ని ఫ్లైఓవర్లను ఆదివారం రాత్రి పూర్తిగా మూసి ఉంచుతారని తెలిపారు. వాహనదారులు ఈ విషయాలను గమనించాలని సూచించారు.
కొత్తగా ఇంటికి వచ్చే అతిథిని ఎదురేగి ఆహా్వనించడానికి ఆ ఇంటికి సంబంధించిన వాళ్లు మాత్రమే రెడీ అవుతారు. కాని ఇప్పుడొచ్చే చుట్టం అందరిదీ. విశ్వవ్యాప్త అతిథి. ఏడాది పాటు వద్దన్నా మనతోనే ఉంటుంది. అందుకే విశ్వమంతా ఈ సంబరం..అందుకే విశ్వనగరంలోనూ అది తాకుతోంది అంబరం..అదే నూతన సంవత్సర సంరంభం.
నిబంధనలు పాటించండి: సీపీ
పరిమితులకు లోబడే న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించవద్దని నగరవాసులకు హైదరాబాద్ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త తీర్మానాలు, కొత్త ఊహలు, కొత్త వ్యూహాలను అమలు చేయాలని భావిస్తుంటారు. అందుకు కొత్త ఏడాది ఒక నాందిలాగా భావిస్తుంటాం. ఈ సందర్భంగా వేడుకలాగా చేసుకోవడం ఒక ఆనవాయితీ అని ఇది మంచిదే తప్పేంకాదు. కాకపోతే పోలీసు శాఖ సూచించిన మార్గదర్శకాలు, ఆంక్షలకు లోబడి ఈ వేడుకలు జరుపుకోవాలి’ అని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా సరే ఈ పరిధి దాటితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. క్షణికావేశంలో తప్పులు చేసి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు. పబ్స్, రెస్టారెంట్లు, ఈవెంట్ మేనేజర్లు నిరీ్ణత వేళలు, పరిమితులు పాటించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment