సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గురువారం 36,900 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 201 మందికి పాజిటివ్ వచ్చినట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. ఈమేరకు ఆయన కరోనా బులెటిన్ విడుదల చేశారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,77,747కి చేరిందన్నారు. ఒకరోజులో ఒకరు చనిపోగా, ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,003కు చేరిందని వెల్లడించారు.
ఇక తాజాగా 184 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం కోలుకున్నవారి సంఖ్య 6,69,857కి చేరిందన్నారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో, ఆస్పత్రుల్లో 3,887 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.
కాగా, ఒమిక్రాన్ వేరియంట్ ఉన్న రిస్క్ దేశాల నుంచి బుధవారం 312 మంది ప్రయాణికులు హైదరాబాద్ విమానాశ్రయంలో దిగారు. వారికి పరీక్షలు నిర్వహించగా, ఎవరికీ కరోనా పాజిటివ్ నిర్ధారణ కాలేదన్నారు. ఇప్పటివరకు ఆయా రిస్క్ దేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చినవారి సంఖ్య మొత్తం 2,567కి చేరిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment