భర్తను హత్య చేసిన భార్య
కుమారుడితో కలిసి ఘాతుకం
మోతీనగర్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ కుమారుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసిన సంఘటన అల్లాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ సామల వెంకటరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అల్లాపూర్, పర్వత్‌నగర్‌లో ఉంటున్న వడ్యానం పరమేశ్వర్ కారు డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
అతడికి భార్య భారతి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గత కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భారతి తన భర్త పరమేశ్వర్‌ను హత్య చేయాలని నిశ్చయించుకుంది. ఈ నెల 1న రాత్రి వారిద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో కొట్టుకున్నారు. దీంతో భారతి తన కుమారితో కలిసి పరమేశ్వర్ తలపై ఇస్త్రీ పెట్టెతో మోదడమేగాక, వైర్‌తో మెడకు బిగించి హత్య చేసింది.
ఈ విషయాన్ని కుమార్తె చూడటంతో భారతి అతడని మాదాపూర్‌లోని శ్రావణి హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు పరమేశ్వర్ అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు. దీంతో భారతి, కుమారుడితో సహా పారిపోయింది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితురాలు భారతి, అమె కుమారుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment