చెక్కు బౌన్స్‌ కేసులో నిందితులకు జైలు | - | Sakshi
Sakshi News home page

చెక్కు బౌన్స్‌ కేసులో నిందితులకు జైలు

Published Fri, Sep 27 2024 1:40 AM | Last Updated on Fri, Sep 27 2024 1:40 AM

చెక్కు బౌన్స్‌ కేసులో నిందితులకు జైలు

తిరుపతి లీగల్‌: రెండు వేర్వేరు చెక్కుబౌన్స్‌ కేసుల్లో నిందితులకు జైలుశిక్ష విధిస్తూ తిరుపతి మొదటి, మూడో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిలు గురువారం తీర్పు చెప్పారు. తిరుపతి కొర్ల గుంటకు చెందిన ఎస్‌. రమేష్‌బాబు తన అవసరాల కోసం తిరుపతి, పీకే లేఔట్‌కు చెందిన వై.సుగుణమ్మ వద్ద 2021 జూన్‌ 12వ తేదీన రూ.5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆ సొమ్ము చెల్లించే క్రమంలో అతను 2022 జూలై 14వ తేదీన రూ.5 లక్షలకు చెక్కు ఆమెకు ఇచ్చాడు. సుగుణమ్మ ఆ చెక్కును బ్యాంకులో వేయగా అది బౌన్స్‌ అయింది. దీంతో ఆమె రమేష్‌బాబుపై తిరుపతి మూడో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో చెక్‌ బౌన్స్‌ కేసు దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి రమేష్‌బాబుకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. అలాగే నష్టపరిహారం కింద చెక్కు సొమ్ము రూ.5 లక్షలు చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. మరో కేసులో.. ఏర్పేడు మండలం, పాపానాయుడు పేటకు చెందిన శ్రీవేంకటేశ్వర ఫర్టిలైజర్స్‌ యజమాని పి.రమేష్‌ నాయుడు రేణిగుంట, బుగ్గ వీధికి చెందిన ఎస్‌. కరీముల్లా షరీఫ్‌ వద్ద 2015 జూన్‌ 7వ తేదీన రూ.5 లక్షలు, అదే ఏడాది జూలై నెల 6 తేదీన మరో రూ.5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆ సొమ్ము చెల్లించే క్రమంలో రమేష్‌ నాయుడు 2016 జూన్‌ 15వ తేదీన రూ.7 లక్షలకు చెక్కు, 2016 జూన్‌ 16వ తేదీన రూ.5 లక్షలకు మరో చెక్కును కరీముల్లా షరీఫ్‌కు ఇచ్చాడు. ఆ రెండు చెక్కులను అతను బ్యాంకులో వేయగా బౌన్స్‌ అయ్యాయి. దీంతో అతను రమేష్‌ నాయుడిపై తిరుపతి మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో చెక్‌ బౌన్స్‌ కేసు దాఖలు చేశాడు. కేసు పూర్వపురాలు పరిశీలించిన న్యాయమూర్తి రమేష్‌ నాయుడికి ఏడాది జైలుశిక్ష విధిస్తూ గురువారం తీర్పు చెప్పారు. అలాగే నష్టపరిహారం కింద రూ.12 లక్షల ఫిర్యాది కరీముల్లా షరీఫ్‌కు చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు.

వాలీబాల్‌ జిల్లా జట్ల ఎంపిక

తిరుపతి ఎడ్యుకేషన్‌ : స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) అండర్‌–19 ఉమ్మడి చిత్తూరు జిల్లా బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక పోటీలు గురువారం తిరుపతిలోని ఎస్వీయూ క్యాంపస్‌ స్కూల్‌ ఆవరణలో నిర్వహించారు. ఈ పోటీలకు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి దాదాపు 130 మంది బాలబాలికలు హాజరయ్యారు. బాలబాలికలకు వేర్వేరుగా ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. వీరిలో ప్రతిభ కనబరిచిన బాలుర విభాగంలో 15 మంది, బాలికల విభాగంలో 15 మందిని జిల్లా జట్లకు ఎంపిక చేశారు. ఎంపికై న బాలబాలికల జిల్లా జట్లు కృష్ణా జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్‌ అండర్‌–19వాలీబాల్‌ పోటీలకు జిల్లా తరఫున పాల్గొంటారని ఎస్‌జీఎఫ్‌ అండర్‌–19 కార్యదర్శి ఎస్‌.జయరామయ్య తెలిపారు. ఎంపికై న ఆయా జట్టు సభ్యులను ఎస్వీయూ క్యాంపస్‌ స్కూల్‌ హెచ్‌ఎం సఖీనమ్మ, కె.షణ్ముగం, పి.శ్రీనివాసులు, పి.ప్రశాంత్‌బాబు, పీడీలు, పీఈటీలు అభినందించారు.

బాలుర జట్టు:ఎం.యోగేష్‌రెడ్డి, కె.సన్ని, డి.మాధవ్‌, జి.జాన్సన్‌, పి.జశ్వంత్‌, కె.జీవ, ఆర్‌.హేమంత్‌కుమార్‌, ఎ.ఇమ్మానుయెల్‌, పి.గణేష్‌, ఎం.చరణ్‌తేజ, కె.ఉదయ్‌కిరణ్‌, ఎం.చైతన్యశ్రీరామ్‌, పి.రాజ, ఎ.లోహిత్‌, జి.తేజ ఎంపికయ్యారు.

బాలికల జట్టు: ఎ.పల్లివి, కె.రెడ్డికౌశల్య, ఎ.రాజేశ్వరి, ఎం.అశ్విని, ఎం.కల్యాణశాంతి, సి.అనూష, కె.సుమన్యశ్రిక, ఎన్‌.వైష్ణవి, కె.త్రినయని, జి.మానస, పి.రేణుకాబాయి, బి.బేబి, బి.ఈశ్వరికుమారి, జి.సునీత, సి.విజయప్రణీత ఎంపికయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement