● డిసెంబర్ 5, 14 సాగునీటి సంఘాల ఎన్నికలు
తిరుపతి అర్బన్: సాగునీటి రాజకీయాలకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పదేళ్ల తర్వాత మళ్లీ ఆయకట్టు ఎన్నికలకు తెరలేపింది. అధికార దర్పంతో అన్ని సంఘాలను కైవసం చేసుకోవడానికి పన్నాగాలు పన్నుతోంది. ఎన్నికల అనంతరం ఇరిగేషన్ పనులను టీడీపీ కూటమి నేతలకు కట్టబెట్టేందుకు సన్నద్ధమవుతోంది.
డిసెంబర్‌లో ఎన్నికలు
జిల్లా ఆయకట్టు ఎన్నికలను వచ్చే నెల 5, 14 తేదీల్లో నిర్వహించనున్నారు. 5వ తేదీ నోటిఫికేషన్ ఇవ్వడంతోపాటు మైనర్ ఇరిగేషన్‌కు చెందిన 599 చెరువులకు ఎన్నికలు చేపట్టనున్నారు. 14వ తేదీన మీడియం ప్రాజెక్టులైన స్వర్ణముఖి, అరణియార్ ఎన్నికలు నిర్వహించనున్నారు. స్వర్ణముఖికి 6 కమిటీలను, అరణియార్‌కు 5 కమిటీలను ఎంపిక చేయనున్నారు. మొత్తంగా చెరువులు, మీడియం ప్రాజెక్టులతో కలసి 610 కొత్త కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. అయితే మేజర్ ప్రాజెక్టు అయిన తెలుగుగంగ ప్రాజెక్టు ఎన్నికలు మాత్రమే వాయిదా పడ్డాయి.
నోడల్ అధికారిగా మదన్‌గోపాల్
సాగునీటి ఎన్నికలకు జిల్లా ఇరిగేషన్ అధికారి మదన్‌గోపాల్‌ను నోడల్ ఆఫీసర్‌గా నియమించారు. ఆయన నేతృత్వంలో ఎన్నికల ప్రక్రియ చేపట్టనున్నారు. ఎన్నికలకు 3,605 మంది సిబ్బందిని ఉపయోగించనున్నారు.
డిసెంబర్‌లో నైనా ఎన్నికలు జరిగేనా?
సాగునీటి ఎన్నికలు రెండు సార్లు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో డిసెంబర్‌లో అయినా వాయిదాలు వేయకుండా ఎన్నికలు నిర్వహిస్తుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment