రాష్ట్ర బడ్జెట్‌లో నేతన్నలకు రిక్తహస్తం
● హామీలు విస్మరించిన కూటమి నేతలు ● 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఊసే లేదు ● ఆరోగ్య బీమా మాటెత్త లేదు ● మగ్గాలు వదిలి వలసబాటే శరణ్యమంటున్న చేనేతలు
గతంలో అండగా నేతన్న నేస్తం
వెంకటగిరి(సైదాపురం): చేనేతల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామంటూ కూటమి నేతలు చెబుతున్న మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. గత సోమవారం నుంచి జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో వారికిచ్చిన హామీల మేరకు కనీసం నామమాత్రంగానైనా కేటాయింపులు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్ర బడ్జెట్ రూ.2.94,427.25 కోట్లు కాగా అందులో చేనేతలకు 0.066 శాతం కేటాయించడంపై నేతన్నలు మండిపడుతున్నారు. కేంద్ర బడ్జెట్‌లోనూ చేనేత రంగానికి కేటాయింపులు తగ్గించడంపై పలువురు రగిలిపోతున్నారు.
మోడు బారిన మగ్గం బతుకులకు గత రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ రంగులు అద్దింది. నేత పనులు సాఫీగా సాగే విధంగా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ నేతన్న నేస్తం పథకానికి పురుడుపోశారు. ఈ పథకం కింద అర్హత కలిగిన చేనేత కుటుంబానికి నెలకు రూ.2 వేలు చొప్పున ఏడాదికి రూ.24 వేలు బ్యాంకు ఖాతాల్లో జమచేస్తూ వచ్చారు. ఐదు విడతల్లో ఒక్కో నేత కార్మికుడికి రూ.1.2 లక్షలు అందించారు. వృత్తి నైపుణ్యాలు మెరుగుపరుచుకునేందుకు క్లస్టర్లు ఏర్పాటు చేసి వైరెటీ డిజైన్లు, 240 హుక్స్ మోటరైజ్డ్‌లిప్టింగ్ డైవ్స్, ఐరన్ ప్రేమ్‌లూమ్స్‌లాంటి మిషన్లు, మోటార్లు తదితర పరికరాలను 80 శాతం సబ్సిడీతో అందించారు. వెంకటగిరిలోని భావానారుషి చేనేత క్లస్టర్‌లో 895 మంది చేనేత లబ్ధిదారులకు రూ.1.63 కొట్ల రుణాలు మంజూరు చేశారు. ప్రస్తుతం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం కార్మికులకు సరైన ప్రోత్సాహం, ఉపాధి ఇవ్వకపోవడంతో ఇతర రాష్ట్రాలకు వలసపోయే పరిస్థితి దాపురించింది.
Comments
Please login to add a commentAdd a comment