మూగబోతున్న మగ్గాలు
తిరుపతి జిల్లా వెంకటగిరి, పుత్తూరు, నారాయణవనం తదితర ప్రాంతాల్లో పలువురు చేనేత మగ్గాలపై ఆధారపడి జీవిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చేనేతను పూర్తిగా విస్మరించడంతో పలువురు నేతన్నలు మగ్గాలు వదిలి ఇతర కూలిపనుల్లో నిమగ్నమవుతున్నారు. మరికొందరు కుటుంబాలతో సహా ఇతర ప్రాంతాలకు వలసబాట పడుతున్నారు. ఈ క్రమంలోనే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వెంకటగిరిలో 5 వేల మగ్గాలు పైచిలుకు ఉండగా ప్రస్తుతం 2వేలకు తగ్గిపోయాయి. కొందరు కులవృత్తిని వదులుకోలేక ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా వస్త్రాలు, డ్రస్ మెటీరియల్ తయారు చేస్తున్నా వాటికి మార్కెట్లో డిమాండ్ లేక కుమిలిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment