ఆగమోక్తంగా లక్ష బిల్వార్చన, కుంకుమార్చన
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. మొదట స్వామి, అమ్మవార్లకు అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు, రుత్వికులు ఆలయ అలంకార మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కాగా ఈ పూజలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయ.
26లోపు పది పరీక్ష ఫీజు చెల్లించండి
తిరుపతి ఎడ్యుకేషన్ : జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజును ఈ నెల 26వ తేదీలోపు చెల్లించాలని డీఈఓ కేవీఎన్.కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు పరీక్ష ఫీజును 10,708 మంది చెల్లించారని, ఇంకా 14,916 మంది చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ఫీజు చెల్లించని ఆయా యాజమాన్య పాఠశాలల కరస్పాండెంట్లు, ప్రధానోపాధ్యాయులు తక్షణమే పరీక్ష ఫీజును చెల్లించేలా చొరవ తీసుకోవాలన్నారు.
ఓటు నమోదు అవకాశం
తిరుపతి అర్బన్: అర్హులైన వారు ఓటును నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ శుక్రవారం తెలిపారు. ఆ మేరకు శని, ఆదివారాల్లో జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉంటారని వెల్లడించారు. ఫారం 6 తొలగింపులు, ఫారం 7 సవరణకు సంబందించి ఫారం 8ను స్వీకరిస్తారని వివరించారు. 18 ఏళ్ల నిండిన వారు ఓటును నమోదు చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment