తుక్కు సూత్రధారులను సస్పెండ్ చేయాలి
తిరుపతి సిటీ : ఎస్వీయూలో గత కొద్దిరోజులుగా అక్రమంగా తరలిస్తున్న స్క్రాప్‌పై సమగ్ర విచారణ జరిపించాలని, కుంభకోణానికి కారకులైన అధికారులను సస్పెండ్ చేయాలని ఏఐఎస్‌ఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఏఐఎస్‌ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్‌జీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ మధు మూర్తిని కలసి వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ యూనివర్సిటీలో నిబంధనలు పాటించకుండా గుట్టుచప్పుడు కాకుండా స్క్రాప్‌ను కొందరు అధికారులు లారీల ద్వారా విక్రయించి సొమ్ము చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు రూ.60 లక్షల విలువచేసే కుర్చీలు, ఐరన్ వస్తువులు, పేపర్స్, ప్లాస్టిక్ స్క్రాప్‌ను కేవలం రూ.8 లక్షలకు విక్రయించారని మండిపడ్డారు. బహిరంగ టెండర్స్ పిలవకుండా పేపర్ ప్రకటన లేకుండా విక్రయించడం వర్సిటీ ఆస్తిని కొల్లగొట్టడం దారుణమన్నారు. తక్షణమే ప్రస్తుతం విక్రయిస్తున్న పద్ధతిని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment