ఆత్మీయత కురిపిస్తూ..
ఆంక్షల కంచెను ఛేదించారు. కూటమి కుట్రలను భగ్నం చేశారు. పోలీసుల ఎత్తుగడలను చీల్చుకుంటూ శ్రీపద్మావతి మెడికల్ కళాశాలకు చేరుకున్నారు. బుధవారం రాత్రి వైకుంఠద్వార దర్శన టికెట్ల తోపులాటలో గాయపడిచికిత్స పొందుతున్న వారిని గురువారం మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. ముందుగా ఆయన రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన తిరుపతి బయల్దేరారు. తిరుచానూరు వద్దకు చేరుకోగానే పోలీసులు అడ్డంకులు సృష్టించారు. కూటమి నేతల ఒత్తిడి మేరకు సుమారు అర్ధగంట తర్వాత వెళ్లాలని సూచించారు. వారి కుటిల బుద్ధిని గ్రహించిన జననేత కాలినడకన బయల్దేరారు. కొంతదూరం వెళ్లాక పార్టీ కార్యకర్త కారులో శ్రీపద్మావతి మెడికల్ కళాశాలకు చేరుకున్నారు. గాయపడి అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను ఆప్యాయంగా పలకరించారు. చేతులు పట్టుకుని ఆత్మీయతను కురిపించారు. గాయాలను చూసి చలించిపోయారు. అందుతున్న వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. తొక్కిసలాట ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యుల కన్నీళ్లు తుడిచి ఓదార్చారు. నేనున్నానంటూ భరోసానిచ్చారు. అధైర్యపడొద్దని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని సిబ్బందిని ఆదేశించారు. పరామర్శలో మాజీ ముఖ్యమంత్రి వెంట మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, గురుమూర్తి, పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీలు భరత్, సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, సమన్వయకర్తలు విజయానందరెడ్డి, భూమన అభినయ్‌రెడ్డి, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. – సాక్షి ప్రతినిధి, తిరుపతి
కూటమి ‘షో’
● వైఎస్ జగన్ వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డంకులు
● వైకుంఠ ద్వార దర్శన బాధితులను పరామర్శించకుండా కూటమి నేతల ఎత్తుగడలు
● కుటిల రాజకీయాలకు తలొగ్గిన పోలీసులు
● అన్నింటినీ దాటుకుని గాయపడ్డ భక్తులను పరామర్శించిన మాజీ సీఎం
● ఆత్మీయతను పంచుతూ.. అండగా నిలుస్తామని భరోసా
● నేను ఉన్నానని.. ఆదుకుంటానని హామీ
వైఎస్.జగన్‌కు శ్రేణుల అభివాదం
● పరామర్శల పేరుతో ఫొటోలకు ఫోజులిచ్చిన సీఎం, డెప్యూటీ సీఎం
● తూతూమంత్రంగా బాధితుల పరామర్శ
Comments
Please login to add a commentAdd a comment