సాక్షి ప్రతినిధి, తిరుపతి : తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తలోమాట మాట్లాడారు. వేర్వేరు అధికారులను టార్గెట్ చేసి మాట్లాడారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని సీఎం చంద్రబాబు నోరె త్తి మాట్లాడలేదు. డెప్యూటీ సీఎం మాత్రం టీటీడీ చైర్మన్, ఈఓ శ్యామ లరావు, అదనపు ఈఓ వెంకయ్యచౌదరి తప్పుందని తేల్చిచెప్పారు. వారి మధ్య సమన్వయ లోపం వల్లే తొక్కిసలాట జరిగిందని స్పష్టం చేశారు. తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, జేఈఓ గౌతమి, సీఎస్‌ఓ శ్రీధర్, గోశాల డైరెక్టర్ హర్షవర్థన్‌రెడ్డిపై చర్యలు తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అదే విధంగా తిరుపతి ఈస్ట్ పోలీస్టేషన్ పరిధిలో తొక్కిసలాట జరిగింది. ఆ పోలీస్టేషన్ పరిధిలో సుమారు మూడు నెలలుగా సీఐ లేరు. సీఐగా పనిచేస్తున్న మహేశ్వర్‌రెడ్డిని గతంలో బదిలీ చేశారు. అప్పటి నుంచి సీఐని నియమించలేదు. వెస్ట్ సీఐకి ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా తిరుపతిలోని కొందరు డీఎస్పీలు, సీఐలు చేసిన తప్పిదమే ఘోరమైన ఘటనకు కారణంగా పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. భక్తుల రద్దీ పెరుగుతున్న విషయాన్ని ఆ డీఎస్పీలు, సీఐలు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లలేదని తెలిసింది. ముఖ్యంగా నిఘా వర్గాలైన ఇంటిలిజన్స్, విజిలెన్స్, ఎస్బీ రద్దీని ఎందుకు అంచనా వేయలేకపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment