No Headline
ప్రభుత్వ తప్పిదం వల్లే
లక్షల మంది భక్తులు వస్తారని తెలిసి కూడా అధికారులను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. టీటీడీ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వహించారు. లక్షల మంది శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ విషయంలో అధికారులు, పోలీసుల తప్పిందం స్పష్టంగా కనిపిస్తోంది. తమిళనాడు, ఆంధ్ర, కేరళ భక్తులు క్యూలైన్ల తొక్కిసలాటలో చనిపోవడం దారుణం. కనీస వసతుల కల్పనపైనా, భక్తులను కంట్రోల్ చేయడంలోనూ.. వారికి టోకన్ల సమాచారం అందించడంలోనూ ప్రభుత్వం విఫలమైంది. బుధవారం జరిగిన ఘటనపై విచారణ జరిపి కారకులను కఠినంగా శిక్షించాలి.
–నారాయణరావు, రిటైర్డ్ ఉద్యోగి, తిరుపతి
ఇంత నిర్లక్ష్యమా?
తిరుణ్ణామళైలో గత ఏడాది జరిగిన కార్తీక దీపోత్సవంలో దేశంలోని పలు రాష్ట్రాల నుంచి కోట్ల మంది భక్తులు విచ్చేసి దర్శించుకున్నారు. ఆ ప్రదేశంలో అడుగడుగునా పోలీసు బందోబస్తు కల్పించారు. భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించారు. కానీ తిరుమలలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల క్యూలైన్లలో తాగునీరు, భోజన వసతి, కనీసం మరుగుదొడ్లు కూడా లేవు. పిల్లలు, మహిళలు, వృద్ధులు పడిన బాధ వర్ణనాతీతం. ప్రత్యక్ష సాక్షిగా చెబుతున్నా. తొక్కిసలాటలో చనిపోయిన వారి ఉసురు అధికారులకు, ఈ ప్రభుత్వానికి తగులుతుంది. ఒక్కసారిగా క్యూలోకి భక్తులను వదలడం వల్లే తొక్కిసలాట జరిగింది.
–సుహాసిని, ప్రత్యక్ష సాక్షి, బైరాగిపట్టెడ, తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment