క్యూలో ఇక్కట్లు పడుతున్న భక్తులు
చిత్రహింసలకు గురిచేశారు
సాధారణ భక్తుల సేవకు ప్రాధాన్యత నిస్తామంటూ పాలకులు, అధికారులు ప్రగల్భాలు పలికారు. లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కౌంటర్లకు రప్పించి చిత్రహింసలకు గురిచేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం టీటీడీలో ఉద్యోగం కల్పించాలి. రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియో అందించాలి. టీటీడీలో అధికారుల తీరు మారేందుకు ప్రభుత్వ కఠినంగా వ్యవహరించాలి.
–లక్ష్మమ్మ, సీఐటీయూ నాయకురాలు, తిరుపతి
●
భక్తులను లెక్కచేయలేదు
తమిళనాడులోని అరుణాచలంలో గిరిప్రదక్షిణకు పలు రా ష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు హాజరువుతుంటారు. ఇప్పటివరకు చిన్న ఘటన చోటు చేసుకోలేదు. అక్కడి పద్ధతులు, ఉద్యోగులు, అధికారుల ప్రవర్తన, భక్తులపై ప్రేమానురాగాలు కురిపిస్తుంటారు. కానీ తిరుమల అధికారుల తీరు అందుకు భిన్నంగా ఉంటోంది. దురుసు ప్రవర్తనతో పాటు, భక్తులను లెక్కచేయకుండా మాట్లాడుతుంటారు. ఇలాంటి ఘటనలకు బాధ్యులైన టీటీడీ అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలి.
–ప్రకాష్, స్థానికుడు, తిరుపతి రూరల్
టీటీడీ చరిత్రలో దుర్దినం
టీటీడీ చరిత్రలో ఇదో దుర్దినం అని చెప్పాలి. ఇందుకు ప్రధాన కారణం పోలీసుల నిర్లక్ష్య వైఖరితో పాటు, టీటీడీ అధికారుల వ్యవహార శైలే కారణం. పర్యవేక్షణ, ఏర్పాట్ల విషయంలో నిరక్ష్యం వహించారనే విషయం సుస్పష్టం. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల మాట దేవుడెరుగు కనీసం స్థానికులతో సైతం వారి వ్యవహార శైలి అహంకారపూరితంగా ఉంటుంది. దేశంలోని ఏ దైవ క్షేత్రాలలోనూ ఇలాంటి వ్యవహార శైలి కనబడదు. భక్తులతోనే చలగాటం ఆడుకోవడంతో సనాతనధర్మానికి ఇదో పెను ముప్పు. –గౌరీదేవి, స్థానికురాలు, తిరుపతి
టీటీడీలో రాజకీయ జోక్యం ఎక్కువ
ఉద్యోగులు సేవే లక్ష్యంగా పనిచేయాల్సి ఉంది. కానీ టీటీడీలో అధికారులు, సిబ్బంది కలెక్టర్, సీఎం స్థాయితో పోల్చుకుంటున్నారు. భక్తులతో అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారు. టీటీడీలో పనిచేస్తున్నామంటే తామే దేవుళ్లుగా ఫీలవుతుంటారు. భక్తులంటే రోడ్లపై అడుక్కుతినే యాచకుల కంటే హీనంగా చూస్తున్నారు. గతంలో ఇలాంటి సంస్కృతి ఉండేది కాదు. గోవిందా అంటూ భక్తులను ప్రస్తావించే వారు. టీటీడీలో రాజకీయ జోక్యం ఎక్కువ కావడంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. టీటీడీలో ప్రక్షాళన చేపట్టాలి. –గణేష్, భక్తుడు, తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment