హామీల ‘పండగ’!
పక్షుల పండుగ అంటే మూడు రోజుల పాటు సినీ తారల తళుకు బెళుకులు, సినీ యాంకర్లు, పాట కచ్చేరీలు, అర్ధనగ్నంగా డ్యాన్స్‌లు, కామెడీ షోలు, మిమిక్రీలు లాంటి సాంస్కృతిక కార్యక్రమాలతోనే సరిపెట్టేస్తున్నారు. నేలపట్టులో పక్షులు నివసించేందుకు చెట్లు పెంచడం, పులికాట్ సరస్సులో నీళ్లు ఎప్పుడూ ఉండేలా ముఖద్వారాలు పూడిక తీయించడం, భీములవారి పాళెం పడవల రేవు వద్ద రిస్టార్ట్స్ ఏర్పాటు చేయడం, ఎప్పుడూ బోట్ షికారు ఉండేలా చర్యలు చేపట్టడం లాంటి పనులు చేయాల్సి ఉన్నా ఆ దిశగా ఎవరూ ప్రయత్నాలు చేయలేదు. ఈ ఏడాది ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర పర్యాటకశాఖామంత్రి కందుల దుర్గేష్ ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్‌లో చేర్చుతామని హామీ ఇచ్చారు. అలాగే పులికాట్ ముఖద్వారాల పూడిక తీతకు రూ.142 కోట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ హామీలు ఎంత మేర నెరవేరుతాయో వేచి చూడాలి మరి.
తళుకు బెళుకులే.. అభివృద్ధి కలే!
Comments
Please login to add a commentAdd a comment