త్వరితగతిన భూసేకరణ
తిరుపతి అర్బన్ : జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర స్థాయి అధికారులతో భూసేకరణ అంశాలపై కలెక్టర్ ముందుగా మాట్లాడారు. అనంతరం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి జాప్యం లేకుండా రైతులకు పరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోలుకు వినతి
వరదయ్యపాళెం: వరి కోతల సమయానికి ధాన్యం కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా వ్యవసాయశాఖాధికారి ప్రసాదరావుకు వరదయ్యపాళెం మండలంలోని ముస్లింపాళెం, చెన్నవారిపాళెం, సీఎల్‌ఎన్‌పల్లె రైతులు విన్నవించారు. మంగళవారం మండల పర్యటనకు వచ్చిన ఆయనను రైతులు కలిసి పలు సమస్యలు వెల్లడించారు. ధాన్యానికి గిట్టుబాటు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది కంటే బస్తాకు రూ. 600 నుంచి రూ. 800 వరకు రేటు తగ్గినట్లు వాపోయారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోతే తీవ్రంగా నష్టపోవాల్సిన వస్తుందని వివరించారు. వ్యవసాయశాఖ అధికారిమాట్లాడుతూ రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని తెలిపారు. ప్రతిఒక్కరూ తప్పకుండా ఈకేవైసీ నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సత్యవేడు వ్యవసాయశాఖ ఏడీఏ సుబ్రమణ్యం, ఏఓ గౌరి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment