ఉపాధి పనులు వేగవంతం
తిరుపతి రూరల్: ఉపాధి నిధులు రూ.3.99 కోట్లతో మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని డ్వామా ఏపీడీ రెడ్డెప్ప ఆదేశించారు. తిరుపతి రూరల్ మండలంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఏపీఓ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ రూరల్ మండలంలో రూ.3.99 కోట్లతో 11 కిలోమీటర్లకు పైగా సీసీ రోడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఈ పనులను ఈ నెలఖారు లోపు పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. ఏపీఓ మమతరాణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment