No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Mon, Oct 28 2024 8:41 AM | Last Updated on Mon, Oct 28 2024 8:41 AM

No He

No Headline

తాండూరు టౌన్‌: పోలీసు అమరుల కుటుంబాలకు, హోంగార్డులకు చేయూతనందించిన లయన్స్‌క్లబ్‌, ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ సంస్థల సేవలు అభినందనీయమని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక డీఎస్పీ కార్యాలయ ఆవరణలో ఈ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పోలీసు అమరుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు, 41 మంది హోంగార్డులకు యూనిఫాం అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగం అంటేనే తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ నిత్యం ప్రజా క్షేమం కోసం పరితపించడం అన్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన వారి సంఖ్య ఎక్కువగా పోలీస్‌ శాఖలోనే ఉంటుందన్నారు. ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ సేవల విషయంలో ముందుంటారన్నారు. అలాంటి పోలీసులకు చేయూతనందిస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు, దాతలకు అభినందనలు చెప్పారు. అనంతరం తాండూరు లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు రొంపల్లి సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా పోలీసులకు సహకారం అందజేస్తున్నామన్నారు. భవిష్యత్‌లోనూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ సభ్యులు రమేష్‌ చంద్ర పండిట్‌, అసద్‌, వీరప్రసాద్‌, ఎస్పీ శ్రీకాంత్‌, శివకుమార్‌, శ్రీధర్‌, పలువురు ఐవీఎఫ్‌ సభ్యులు పాల్గొన్నారు.

తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
No Headline1
1/1

No Headline

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement