రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే

Published Thu, Oct 31 2024 8:06 AM | Last Updated on Thu, Oct 31 2024 8:06 AM

-

కుల్కచర్ల: రాష్ట్రంతోపాటు దేశంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించబోతోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం కుల్కచర్ల, చౌడాపూర్‌ మండలాల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన అవినీతికి రాష్ట్రం అధోగతి పాలైందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలోనూ వెనుకబాటుకు గురవడం తప్పిస్తే అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. రాష్ట్రంలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. కొందరు బీజేపీ బలపడటాన్ని చూసి ఓర్వలేక కుల, మత, ప్రాంతీయ విబేధాలు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని, అది సాధ్యంకాని పని అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రహ్లాదరావు, కిసాన్‌ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారుతీకిరణ్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మిట్టా పరమేశ్వర్‌రెడ్డి, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల సౌమ్యారెడ్డి, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ఘణపురం వెంకటయ్య, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గోవింద్‌ నాయక్‌, ఉపాధ్యక్షుడు జానకీరాం చౌహాన్‌, కుల్కచర్ల మండల అధ్యక్షులు సూర్యకాంతం, ప్రధాన కార్యదర్శి హన్మంతు, జి.వెంకటయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు మైపాల్‌, కిసాన్‌ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు సంతోష్‌, బీజేవైఎం మండల అధ్యక్షుడు గడుసు మైపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

మోదీ నాయకత్వంలో దేశం అన్ని విధాలా అభివృద్ధి

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement