సమర్థవంతంగా నిర్వహించాలి
కొడంగల్: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మున్సిపల్, మండల సర్వే సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సర్వేకు సిద్ధం కావాలని ఆదేశించారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల అంశాలపై సర్వే చేయాల్సి ఉంటుందన్నారు. తప్పిదాలకు తావులేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ జ్ఞానేశ్వర్, తహసీల్దార్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో అఖిల పక్ష నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. 2025 జనవరి ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేలా నాయకులు చొరవ తీసుకోవాలని కోరారు. నవంబర్ 28వ తేదీ వరకు నూతన ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులు, ఓటరు జాబితాల అభ్యంతరాలపై ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. నవంబర్ 9, 10 తేదీల్లో ఓటరు నమోదు కోసం బూతు స్థాయిలో ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment