దీపావళి శుభాకాంక్షలు
అనంతగిరి: జిల్లా ప్రజలకు శాసనసభ స్పీకర్ ప్రసాద్‌కుమార్ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. చిరుదివ్వెలతో చీకట్లను పారదోలేది దీపావళి పండుగ అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. పేదలు, రైతుల సంక్షేమం కోసం సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రజలు తగు జాగ్రత్తలతో దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు
స్పీకర్‌కు ఎమ్మెల్యే శుభాకాంక్షలు
తాండూరు: స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం నగరంలో వారిని మర్యాద పూర్వకంగా కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలు దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని సూచించారు.
మొసలి ఉంది జాగ్రత్త
దౌల్తాబాద్: మండలంలోని బాలంపేట చెరువులో మొసలి ఉందని.. ప్రజలు చెరువు వద్దకు వెళ్లరాదని కొడంగల్ అటవీశాఖ అధికారులు సూచించారు. బుధవారం ఈ మేరకు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం చెరువులో మొసలి ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే. పరిశీలించిన అధికారులు చెరువులో మొసలి ఉన్నట్లు గుర్తించి బుధవారం ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
తెలంగాణలో
పెట్టుబడులు పెట్టండి
టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి
ఆమనగల్లు: తెలంగాణలో పెట్టుబడులు పెట్టే అవకాశాలను వివిధ కంపెనీలు పరిశీలించాల ని టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి కోరారు. అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరుగుతున్న ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్‌లో తెలంగాణ ప్రతినిధులుగా ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి హాజరయ్యారు. సమ్మిట్‌లో వివిధ కంపెనీల ప్రతినిధులను వారు కలిశారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో తెలంగాణ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మే షన్ లక్ష్యాల సాధన, స్మార్ట్ గవర్నెన్స్ కోసం తెలంగాణ రూపొందించిన ప్రణాళికల అమ లు, ఏఐ ఇన్నోవేషన్ కేంద్రంగా ఫ్యూచర్ సిటీని మార్చాలన్న ప్రభుత్వాశయం, పబ్లిక్ సర్వీసెస్ డెలివరీ సిస్టం, డిజిటల్ గవర్నెన్స్ మెరుగుదల, ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు, స్కిల్ డెవలెప్‌మెంట్ యూనివర్సిటీ లక్ష్యాలను వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment