మెరుగైన వైద్యం అందాలి
పెద్దేముల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందాలని, అలాగే సిబ్బంది సమయపాలన పాటించాలని డీఎంహెచ్‌ఓ వెంకటరవణ అన్నారు. బుధవారం పెద్దేముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. సిబ్బంది, ఓపీ రిజిస్టర్ తోపాటు మందుల స్టోర్ రూమ్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీహెచ్‌సీల్లో మందుల కొరత లేదని, 170 రకాల మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వంద శాతం వ్యాక్సినేషన్, ఇమ్యునేషన్ కొనసాగుతుందన్నారు. పాము, కుక్క కాటుకు మందు ఉందన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలంలో ఎన్ని సబ్‌సెంటర్లు ఉన్నాయి.. సిబ్బంది ఎక్కడి నుంచి విధులకు వస్తున్నారని ఇన్‌చార్జ్ డాక్టర్ బుచ్చిబాబును అడిగారు. మండలంలో మొత్తం 9 సబ్‌సెంటర్లు ఉన్నాయని, తాండూరు నుంచి సిబ్బంది వస్తున్నట్లు డాక్టర్ వివరించారు. సిబ్బంది సక్రమంగా విధులకు రావడం లేదనే ఫిర్యాదులు వచ్చాయని, ఇకపై ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదన్నారు. గతంలో ఇక్కడ 24 గంటల వైద్య సేవలు అందేవని, ప్రస్తుతం 8గంటలకు కుదించడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారని సిబ్బంది డీఎంహెచ్‌ఓకు వివరించారు. పాత పద్ధతిని అమలు చేయాలని కోరారు. స్పందించిన ఆయన ఆ దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిత్యం ఓపీకి 120 మంది రావడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డాక్టర్ వెంకటసాయి తదితరులు పాల్గొన్నారు.
మంచిపేరు తెండి
ధారూరు: ధారూరు మెథడిస్టు క్రిస్టియన్ జాతరకు వచ్చే ఇతర రాష్ట్రాల భక్తులు అనారోగ్య సమస్యలకు గురైతే సత్వర వైద్య సేవలు అందించి మంచి పేరు తీసుకరావాలని డీఎంహెచ్‌ఓ వెంకటరవణ సూచించారు. ధారూరు జాతరలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని బుధవారం సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏ జబ్బుతో వచ్చినా మందులు అందుబాటులో ఉండాలన్నారు. సకాలంలో వైద్యం చేయాలని సూచించారు. ఆయన వెంట డ్యూటీ డాక్టర్ శివకుమార్, ఏఎన్‌ఎంలు ఉన్నారు.
డీఎంహెచ్‌ఓ వెంకటరవణ
Comments
Please login to add a commentAdd a comment