పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం
బడంగ్పేట్: పోరాటాల ద్వారానే దళితుల సమస్య లు పరిష్కారం అవుతాయని దళిత హక్కుల పోరా ట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అని ల్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం బడంగ్‌పేట కార్పొరేషన్ పరిధిలోని కుర్మల్‌గూడ ఇందిరానగర్ కాలనీలో సమావేశాన్ని బాలాపూర్ మండల దళిత సంఘం అధ్యక్షుడు రామస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనిల్‌కుమార్‌తో పాటు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందోజు రవీంద్రాచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల అభ్యున్నతి కోసం పాటు పడటం లేదని విమర్శించారు. దళితులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నారన్నారు. దళితులు ఐక్యతతోనే ముందుకు సాగి హక్కులు సాధించుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు దాసరి మల్లేష్, నాయకులు నారాయణ, ఆంజనేయులు, చంద్రశేఖర్‌రెడ్డి, శివనాయక్, యాదమ్మ, వీరస్వామి, రవి, చిట్టి, మహేష్, సనా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment