పరిగిలో టెన్షన్ టెన్షన్
పరిగి: నగరంలో బుధవారం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంతో పరిగిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే పరిగి పోలీస్‌స్టేషన్ చుట్టూ పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. స్టేషన్ చట్టు పక్కలకు ఎవ్వరినీ అనుమతించ లేదు. మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని వికారాబాద్ నుంచి పరిగి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఇక్కడ రెండు గంటల పాటు విచారించినట్టు సమాచారం. బీఆర్ఎస్ నాయకులు రాకుండా పోలీసులు వాహనాల్లో తిరుగుతూ వారి కదలికలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. అనంతరం నరేందర్‌రెడ్డిని కొడంగల్ కోర్డుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment