ప్రతీ గింజ ఖరీదు చేస్తాం
పెద్దేముల్: రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం ఖరీదు చేస్తుందని కోటపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డకింది అంజయ్య అన్నారు. బుధవారం మండలంలోని జనగాం గ్రామంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో రెండో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం విక్రయించేందుకు రైతులు ఇబ్బంది పడరాదనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఎన్నికల హామీ మేరకు సన్నరకం వడ్లకు రూ.500ల బోనస్ ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోరాదని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ధారాసింగ్, కోటపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, డీసీఎంఎస్ మేనేజర్ ఎల్లయ్య, సీఈఓ లక్ష్మణ్, తట్టేపల్లి పీఏసీఎస్ డైరక్టర్ మల్లెశం, జిల్లా యువ నాయకుడు మైపాల్‌రెడ్డి, తాండూరు వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ జితేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ రాములు యాదవ్, నాయకులు డీవై నర్సింలు, విజయకుమార్, రవిశంకర్, మైపూస్, విద్యాసాగర్, బంద్యప్ప తదితరులు పాల్గొన్నారు.
కోటపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య
Comments
Please login to add a commentAdd a comment