పకడ్బందీగా రైతు భరోసా సర్వే
సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్
తాండూరు రూరల్: గ్రామాల్లో పకడ్బందీగా రైతు భరోసా సర్వే కొనసాగుతుందని తాండూరు డివిజన్ సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. సోమవారం ఆయన మండలంలోని ఎల్మకన్నె గ్రామంలో సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో లే అవుట్లు, మైనింగ్, మట్టి తవ్వకాలు జరిపిన భూముల్లో రైతు భరోసా నిలిపివేస్తామన్నారు. సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే పెట్టుబడిసాయం ఇస్తామన్నారు. రైతులకు సమస్యలు ఉంటే స్థానికంగా ఉండే ఏఈఓల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులకు సంబంధించి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ తారాసింగ్, డిప్యూటీ తహసీల్దార్ సందీప్, ఏఈఓ శ్రీనివాస్, నాయకులు జగదీష్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment