వానరానికి అంత్యక్రియలు
కొడంగల్: పట్టణంలో హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై సోమవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని వానరం చనిపోయింది. కుక్కలు లాక్కెళ్తుండగా విషయం తెలుసుకున్న అమ్మ నాన్న ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రవీణ్ అక్కడికి వెళ్లి కోతి కళేబరాన్ని పరిశీలించారు. అనంతరం సంప్రదాయ బద్ధంగా వానరానికి అంత్యక్రియలు చేసి మానవత్వం చాటుకున్నారు.
గవర్నర్‌ను కలిసిన నాయకులు
పరిగి: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను రాజ్‌భవన్‌లో సోమవారం బీజేపీ పట్టణ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. హైదారాబాద్ నగరానికి కూత వేటు దూరంలో ఉన్న పరిగి ఇంకా అభివృద్ధికి నోచుకోలేదని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ సీనియర్ నాయకులు ఆంజనేయులు, రాఘవేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
జీపీ వర్కర్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహారెడ్డి
కేశంపేట: గ్రామ పంచాయతీల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని గ్రామ పంచాయతీ వర్కర్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టంగుటూరి నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రవిచంద్రకుమార్‌రెడ్డితో కలిసి జీపీ వర్కర్స్ కేలండర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు జీఓ 60ని అమలు చేయాలని కోరారు. మల్టీపర్పస్ విధానం రద్దుచేయాలన్నారు. 2011 జనాభా ప్రతిపాదికన పంచాయతీల్లో కార్మికులను నియమించారని, ఆ విధాన్నాన్ని రద్దు చేసి అవసరాలకు అనుగుణంగా కార్మికులను నియమించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీఓ కిష్టయ్య, జూనియర్ అసిస్టెంట్ ప్రకాష్, కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాంచంద్రయ్య, మండల అధ్యక్షుడు రవి, ప్రధాన కార్యదర్శి పారేష, స్వరూప, మల్లయ్య, అంజయ్య, రోశయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రజాసమస్యలపై
నిరంతర పోరాటం
సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రామస్వామి
చేవెళ్ల: ప్రజలకు వంద వసంతాల సందర్భంగా సీపీఐ పార్టీ గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయాలని ఆ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కె.రామస్వామి అన్నారు. మండల కేంద్రంలో సోమవారం మండల కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పార్టీ వంద వసంతాల సందర్భంగా నియోజకవర్గస్థాయి జనరల్‌బాడీ సమావేశం ఈ నెల 28వ తేదీన చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్‌లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశాన్ని నియోజకవర్గంలోని ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కుణంనేని సాంబశివరావు హాజరుకానున్నట్లు తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే పార్టీ సీపీఐ అన్నారు. పెద్ద ఎత్తున ప్రజాసంఘాలు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఈ సమావేశానికి హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి సత్తిరెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment