అంబులెన్సులో రెండు సుఖప్రసవాలు
కందుకూరు: మూడు గంటల వ్యవధిలో ఒకే 108 అంబులెన్స్ సిబ్బంది ఇద్దరు గర్భిణులకు సుఖప్రసవం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి నేదునూరు గ్రామ సమీపంలోని ఇటుక బట్టీల్లో పని చేస్తున్న ఒడిశాకు చెందిన నలినిబాయికి పురిటి నొప్పులు వచ్చాయి. రెండో కాన్పు నిమిత్తం ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో 108కి సమాచారం అందించారు. ఆమెను ఆస్పత్రికి తరలించే క్రమంలో నొప్పులు ఎక్కువ అయ్యాయి. దీంతో ఈఎంటీ రాయుడు, ఫైలట్ యాదయ్య సుఖప్రసవం చేయగా మగ బిడ్డకు జన్మనిచ్చింది.
రాత్రి 2గంటలకు..
అదే రాత్రి 2 గంటల సమయంలో మండల పరిధి లేమూరుకు చెందిన సంధ్యకు పురిటినొప్పులు రావడంతో 108కి సమాచారం అందించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా నొప్పులు అధికమవడంతో వాహనంలో ప్రసవం చేశారు. ఆడపిల్లకు జన్మనిచ్చింది. శంషాబాద్‌లోని సీహెచ్‌సీకి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment