![పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09klky404-640072_mr-1739152079-0.jpg.webp?itok=d0f24z6Q)
పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి
ఆమనగల్లు: రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తోందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యాటక ప్రాంత అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. తలకొండపల్లి మండలం వెల్జాల గ్రామంలో శ్రీ వేదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో ఆదివారం జరిగిన కల్యాణోత్సవానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి హాజరయ్యారు. ఆలయ నిర్వాహకులు మంత్రికి ఘనంగా ఆహ్వానం పలికారు. ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్లు మంజూరు చేయాలని అభ్యర్థించారు. అనంతరం మంత్రి.. జూపల్లి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ దైవచింతన కలిగి ఉండాలని కోరారు. కార్యక్రమంలో టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి, పీసీబీ సభ్యుడు బాలాజీసింగ్, వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు కేవీఎన్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ, మండల అధ్యక్షులు డోకూరు ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు
Comments
Please login to add a commentAdd a comment