![‘మెరి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09kgdgl304c-360016_mr-1739152077-0.jpg.webp?itok=9qcS99rW)
‘మెరిట్’లో మెరిసారు
బొంరాస్‌పేట: చదువులో పేద విద్యార్థులకు ఆర్థికభారం అడ్డు తప్పించేందుకు ప్రతీ ఏడాది జాతీయ స్థాయిలో నేషనల్ మెరిట్ కమ్ మీన్స్ సర్చ్ (ఎన్‌ఎంఎంఎస్) ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నారు. ఫలితంగా దేశ వ్యాప్తంగా 5 వేల మంది పేద విద్యార్థులకు ఉపకార వేతనం అందుతోంది. ఇందులో ఎంపికై న ప్రతీ విద్యార్ధికి సంవత్సరానికి రూ.12వేల చొప్పున తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు నాలుగేళ్లపాటు ఉపకార వేతనం అందుతోంది. 2024–25 విద్యాసంవత్సరంలో నిర్వహించిన అర్హత పరీక్షల్లో జిల్లావ్యాప్తంగా 77 మంది విద్యార్థులు ప్రతిభ కనబరిచి వెరిఫికేషన్ జాబితాలో చేరారు. అందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఎంఈఓలు, జిల్లా విద్యాధికారి సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఫలితాల్లో విద్యార్థుల హవా
ఈ పరీక్షకు దారిద్ర రేఖకు దిగువన ఉన్న తెల్లరేషన్ కార్డుదారుల కుటుంబాల విద్యార్థులు అర్హులు. ప్రభుత్వ పాఠశాలల్లోని ఎనిమిదో తరగతి విద్యార్థులు ఈ అర్హత పరీక్ష రాశారు. అర్హత సాధించిన వారు తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు వరకు ప్రభుత్వం నుంచి ఏడాదికి రూ.12వేల చొప్పున ఉపకారవేతనం బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.
ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం
నవంబర్ నుంచి ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక తరగతులు చెప్పాం. పక్షానికోసారి పరీక్షలు నిర్వహణ, మెంటలెబిలిటీ పై నాతోటి టీచర్లంతా పోటీపరీక్షలకు అవగాన కల్పించారు. విద్యార్థులను వెన్నంటి ప్రోత్సహించాం.
– చంద్రశేఖర్, ఉపాధ్యాయుడు, బొంరాస్‌పేట జెడ్పీహెచ్‌ఎస్
ఆనందంగా ఉంది
మా పాఠశాల నుంచి ఈ ఉపకారవేతకానికి అర్హత సాధించడంలో నేను మొదటి విద్యార్థి ని అవడం ఆనందంగా ఉంది. నాపై ఉపాఽ ద్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పలు రకాల టెస్టులు రాయించారు. సలహాలు, పరీక్ష విధా నం వంటి మాదిరి పరీక్షలు నిర్వహించారు.
– వర్షిని, 8వ తరగతి, హస్నాబాద్ జెడ్పీహెచ్‌ఎస్
సంఖ్య పెరగడం గర్వకారణం
విద్యార్థుల్లో పోటీ పరీక్షలపై అవగాహన, చైతన్యం పెరిగింది. ఈ ఎన్‌ఎంఎంఎస్ పట్ల జిల్లా స్థాయిలో ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తున్నాం. పేద విద్యార్థులకు ఇది చాలా మంచి స్కీమ్. జాతీయస్థాయి పథకంలో జిల్లా విద్యార్థుల సంఖ్య పెరగడం గర్వకారణం.
– రేణుకాదేవి, డీఈఓ, వికారాబాద్
ఉపాధ్యాయుల చొరవ నచ్చింది
ఉపాధ్యాయుల ప్రత్యేక చొరవ ఉంది. పాఠశాల సమయానికి ముందు, తర్వాత, ప్రతి రోజు బోధన. ఈ ఏడాది గతం కన్నా మించి అర్హత సాధించారు. అన్ని పరీక్షల్లో పరీక్షా విధానంపై ప్రత్యేక అవగాహన, ఉపాధ్యాయుల చొరవతో తల్లదండ్రులకు ఆర్థిభారం తగ్గుతుంది.
– వెంకటయ్య, ఎంఈఓ, దోమ
అర్హత సాధించినవారు
మండలం విద్యార్థులు దోమ 15 బొంరాస్‌పేట 12 పూడూరు 10 కుల్కచర్ల 08 నవాబ్‌పేట 07 వికారాబాద్ 06 యాలాల 02 దౌల్తాబాద్ 02 చౌడాపూర్ 02 పెద్దేముల్ 01 బషీరాబాద్ 01 బంట్వారం 01 పరిగి 01 పెద్దేముల్ 01 ధారూర్ 01 పరిగి 01 కొడంగల్ 01 దుద్యాల 01
బాలురు 37 బాలికలు 40 మొత్తం 77
ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌నకు 77 మంది అర్హత
తల్లదండ్రులు, ఉపాధ్యాయుల హర్షం
అత్యధికంగా దోమ, రెండోస్థానంలో బొంరాస్‌పేట
నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.12వేల ఉపకార వేతనం
![‘మెరిట్’లో మెరిసారు1](https://www.sakshi.com/gallery_images/2025/02/10/vkb111_mr-1739152078-1.jpg)
‘మెరిట్’లో మెరిసారు
![‘మెరిట్’లో మెరిసారు2](https://www.sakshi.com/gallery_images/2025/02/10/09kgdgl304d-360016_mr-1739152078-2.jpg)
‘మెరిట్’లో మెరిసారు
![‘మెరిట్’లో మెరిసారు3](https://www.sakshi.com/gallery_images/2025/02/10/09kgdgl304g-360016_mr-1739152078-3.jpg)
‘మెరిట్’లో మెరిసారు
![‘మెరిట్’లో మెరిసారు4](https://www.sakshi.com/gallery_images/2025/02/10/09kgdgl304f-360016_mr-1739152078-4.jpg)
‘మెరిట్’లో మెరిసారు
Comments
Please login to add a commentAdd a comment