టమాటా, ఉల్లి ధరల నియంత్రణపై దృష్టి పెట్టండి
మహారాణిపేట: ‘మార్కెట్‌లో టమాటా, ఉల్లిపాయల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.. వినియోగదారుల అవసరాల మేరకు నిల్వలను అందుబాటులో ఉంచాలి. ధరల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి’అని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో గురువారం జిల్లా ధరల నియంత్రణ కమిటీ సభ్యులతో సమావేశమైన ఆయన.. వివిధ అంశాలపై చర్చించారు. ప్రస్తుతం ఉల్లిపాయలు, టమాటా ధరలు అధికంగా ఉన్నాయని, వాటిని నియంత్రించే దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. చిత్తూరు నుంచి టమాటాలు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. రైతుబజార్లలో ఉండే ఎస్టేట్ అధికారులు బాధ్యతగా పని చేయాలని జేసీ ఆదేశించారు. మార్కెటింగ్ ఏడీ యాసీన్, డీఎస్‌వో వి.భాస్కర్, వివిధ శాఖల అధికారులు, రైతుబజార్ల ఏవోలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment