పారదర్శకంగా విధులు నిర్వర్తించండి
బీచ్‌రోడ్డు: ఆర్పీలు ప్రజలకు అంకితభావంతో సేవలందించాలని జీవీఎంసీ కమిషనర్ పి.సంపత్ కుమార్ పిలుపునిచ్చారు. గురజాడ కళాక్షేత్రంలో ఎస్‌హెచ్‌జీ ప్రొఫైలింగ్ యాప్ వినియోగం, విధి విధానాలపై బుధవారం జీవీఎంసీ పరిధిలోని ఆర్పీలకు వర్క్ షాపు జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆర్పీలు ఒక శక్తిగా ఉండాలన్నారు. నవంబర్ 31లోగా ఎస్‌హెచ్‌జీ యాప్‌లో పూర్తి వివరాలను నమోదు చేయాలని సూచించారు. కోవిడ్ తర్వాత చాలా కుటుంబాలు పేదరికంలోకి వెళ్లాయని.. అటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు. ముఖ్యంగా పిల్లల చదువులకు, అక్కరలేని ఆడంబరాలకు ప్రజలు విపరీతమైన ఖర్చులు చేసి పేదరికంలోకి వెళ్లిపోతున్నారని.. అటువంటి వారిని గుర్తించి వారు పేదరికానికి గురి కాకుండా సలహాలు ఇవ్వాలన్నారు. ఎస్‌హెచ్‌జీ యాప్‌లో వాస్తవాలు నమోదు చేయడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు అర్హులను సులభంగా గుర్తించగలమన్నారు.అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి, యూసీడీ పీడీ పి.ఎం.సత్యవేణి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల స్థితిగతులు, సంఘ సభ్యుల జీవన విధానం తదితర వివరాలు నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌హెచ్‌జీ ప్రొఫైలింగ్ యాప్‌ను ప్రవేశపెట్టిందన్నారు. యాప్‌లో ఎలా నమో దు చేయాలనే విషయంపై స్లమ్ సమాఖ్య రిసోర్స్ పర్సన్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, పట్టణ సమాఖ్య రిసోర్స్ పర్సన్లు, ఏపీడీలకు మెప్మా రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి వర్చువల్‌గా శిక్షణ ఇచ్చారు.
ఆర్పీలకు జీవీఎంసీ కమిషనర్ సూచన
ఎస్‌హెచ్‌జీ ప్రొఫైలింగ్ యాప్‌పై అవగాహన
Comments
Please login to add a commentAdd a comment