విశాఖ సిటీ: విదేశాల్లో ఉద్యోగం పేరుతో అమాయకులను కాంబోడియాకు పంపించి చైనా సైబర్ ముఠాకు అప్పగిస్తున్న మల్కాపురం ప్రాంతానికి చెందిన వ్యక్తిని సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. మల్కాపురం ప్రాంతానికి చెందిన దాసరి వెంకట రాఘవ పార్థసారధి వివిధ దేశాల్లో వెల్డింగ్ పనులు చేసి తిరిగి విశాఖకు వచ్చాడు. అతడికి గతంలో కాంబోడియా సైబర్ కేసులో అరెస్టయిన చుక్కా రాజేష్‌తో పరిచయమైంది. కాంబోడియాకు ఎవరినైనా పంపిస్తే కమీషన్ వస్తుందని ఆశ చూపించాడు. దీంతో పార్థసారధి ముగ్గురిని కాంబోడియాకు పంపించారు. దీనికి అతడికి మంచి కమీషన్ వచ్చింది. తర్వాత పార్థసారధి కాంబోడియాకు వెళ్లి కుక్‌గా స్థిరపడ్డాడు. అక్కడి నుంచే తెలిసిన వారికి విదేశాల్లో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి రాజేష్ ద్వారా 12 మందిని కాంబోడియాకు రప్పించాడు. అక్కడ ఫిలిప్పీన్స్‌కు చెందిన ఆర్య, హబీబ్‌లతో కలిసి వారిని చైనా స్కామ్ కంపెనీలకు పంపించాడు. అలా వెళ్లిన వారితో బలవంతంగా సైబర్ నేరా లు చేయిస్తుండడంపై విశాఖ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. వారి సమాచారం మేరకు.. పోలీసులు పార్థసారధిపై ఎల్‌వోసీ జారీ చేశారు. ఇదిలా ఉంటే పార్థసారధి కాంబోడియా నుంచి బ్యాంకాక్‌కు, అక్కడి నుంచి భువనేశ్వర్‌కు ఈ నెల 5న వచ్చాడు. భువనేశ్వర్ ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేషన్ సిబ్బంది పార్థసారధిపై ఎల్‌వోసీ ఉన్నట్లు గుర్తించి నిలువరించి విశాఖ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడకు వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకొని బుధవారం రిమాండ్‌కు తరలించారు. కాంబోడియా లో ప్రధాన ముఠా కోసం సీపీ శంఖబ్రత బాగ్చి ప్రత్యే క పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. బాధితులు 0891–2565454కు గానీ, సీపీ వాట్సాప్ నెంబర్ 9493336633కు గానీ సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment