అమ్మవారి క్షేత్రాల్లో ఆధ్యాత్మిక శోభ
బీచ్‌రోడ్డు: నగరంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని పలు వీధుల్లో భక్తులు మండపాలు ఏర్పాటు చేసి.. దుర్గమ్మ విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేశారు. తొలి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. రామ్‌నగర్ గ్రామదేవత దుర్గా మల్లేశ్వరి ఆలయంలో ఉత్సవాలు కనులపండువగా సాగాయి. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని భక్తులు వీధుల్లో ఊరేగించి తిరిగి ఆలయానికి చేర్చారు. మహిళలు కలశాలు పట్టుకుని మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. నగరంలోని పలు ఆలయాల్లో కుంకుమ పూజలు జరిగాయి.
ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment