150 అంశాలు.. 275 మంది ప్రసంగాలు
మహారాణిపేట: నగరంలోని ఓ హోటల్‌లో మూడు రోజులుగా జరుగుతున్న ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఇసికాన్–2024) 53వ వార్షిక సదస్సు ఆదివారంతో ముగిసింది. జాతీయ సదస్సులో 150 అంశాలపై 275 మంది ఎండోక్రినాలజిస్ట్‌లు ప్రసంగించారు. మొత్తం మీద 2,600 మంది వైద్యులు 40 సెషన్లలో పాల్గొన్నారు. చివరి రోజు మధుమేహం, పొట్టితనం నియంత్రణలో పురోగతి, ముఖ్యంగా స్థూలకాయాన్ని అధిగమించే వ్యూహాల గురించి విస్తృత స్థాయిలో చర్చించారు. జీవన విధానంలో వివిధ రకాల మార్పుల వల్ల దీర్ఘకాలిక వ్యాధులైన థైరాయిడ్, చక్కెర వ్యాధులు సోకిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, ఈ వ్యాధులను అదుపులో ఉంచుకోవడానికి వ్యాయామం చేయ డం, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోకుండా ఉండాల ని పలువురు ఎండోక్రినాలజిస్టులు సూచించారు. ఆహార అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, నిద్రలేమి, స్టెరాయిడ్ విచ్ఛిన్నంగా వినియోగం వల్ల నపుంసకత్వం రావడం, అవాంఛిత రోమాలు ఎక్కడ పడితే అక్కడ రావడం, జన్యువుల్లో మార్పుల వల్ల పొట్టిగా ఉండడం వంటి సంఘటనలపై చర్చించామని ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వాహక కార్యదర్శి డాక్టర్ కె.ఎ.వి.సుబ్రహ్మణ్యం తెలిపారు. అమెరికా, దుబాయ్, ఖతర్, నేపాల్, ఇండోనేషియా, యు.కె.ల నుంచి పలువు రు విదేశీ వైద్యులు, దేశంలో నిష్ణాతులైన వైద్యులు ఈ సదస్సులో పాల్గొన్నారు. వైద్యులు కె.దిలీప్ కుమార్, శ్రీధర్, మైథిలీ, వివేకానంద, వంశీకృష్ణ, రామ్మోహన్, శ్రీనివాసులు, జయంతి రమేష్, పద్మలత తదితరులు సదస్సు విజయవంతంలో సహకరించారు.
ముగిసిన ఇసికాన్ సదస్సు
Comments
Please login to add a commentAdd a comment