జనవరి నాటికి స్వర్ణభారతి స్టేడియం పనులు పూర్తి
సీతంపేట: స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం అభివృద్ధి పనులు 2025 జనవరి నాటికి పూర్తిచేయాలని జీవీఎంసీ కమిషనర్ పి. సంపత్‌కుమార్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన జీవీఎంసీ అధికారులు, కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు, సాడి పద్మావతిలతో కలిసి స్టేడియం అభివృద్ధి పనులను పరిశీలించారు.స్టేడియంలో ఎక్కువ మంది వీక్షకులు, క్రీడాకారులు కూర్చునేందుకు వీలుగా ఆధునిక కుర్చీలను ఏర్పాటు చేయాలని ప్రధాన ఇంజినీర్ పి.శివప్రసాద్‌రాజు, అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తిని కమిషనర్ ఆదేశించారు. టెన్నిస్ కోర్టు నిర్వహణను నిత్యం పర్యవేక్షించాలని స్పోర్ట్స్ డైరెక్టర్ రాజును ఆదేశించారు. అనంతరం ద్రోణాచార్య అవార్డు గ్రహీత, ఉమెన్ బాక్సింగ్ చీఫ్ కోచ్ ఐ.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జీవీఎంసీ తరఫున మహారాష్ట్ర భూశ్వాల్‌లో నవంబరు 6 నుంచి 9 వరకు జరిగిన ఆల్ ఇండియా ఓపెన్ ఉమెన్ నేషనల్ బాక్సింగ్ పోటీల్లో సాధించిన ట్రోఫీని కమిషనర్‌కు చూపించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ కె.శివప్రసాద్, పర్యవేక్షక ఇంజినీర్ పి.వి.వి.సత్యనారాయణ, ఏసీపీ సి.హెచ్.మధుసూదనరావు, సహాయ వైద్యాధికారి బి.ప్రసాదరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment