దీప కాంతుల్లో.. కార్త్తీక వెన్నెల
సృష్టికి తొలిదీపం భగవంతుడే.. ఆయనే జ్యోతి స్వరూపుడు. అందుకే ఏ దేవుని, దేవత నామావళిని మనం గమనించినా పరంజ్యోతి, జ్యోతిసే నమఃఅని.. పరంజ్యోతియే నమః, జ్యోతిస్వరూపాయై నమః అని ఉంటుంది. తాను ప్రకాశిస్తూ అన్నింటినీ ప్రకాశింపజేసే రూపం ఏదో అదే జ్యోతి. అదే భగవంతుడు. వెలుగులకు వెలుగు, సమస్త లోకాలను కాంతిమయం చేయగలిగిన వాడు పరమాత్ముడే. ఆ జ్యోతి మన హృదయాలలో కూడా ఆత్మజ్యోతిగా ప్రకాశించాలనే ప్రార్థనతో చేసేదే దీపారాధన. పవిత్రమైన కార్తీకమాసంలో అన్ని రోజులు ప్రత్యేకమే అయినా.. కార్తిక పౌర్ణమి మరింత విశిష్టం. అందుకే ఆ పర్వదినాన గృహాలు, ఆలయాలు దీపకాంతుల శోభతో కళకళలాడాయి. దేవాలయాలు జ్వాలాతోరణాలతో దేదీప్యమానంగా ప్రకాశించాయి.
–ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం
దీప కాంతుల్లో..
కార్తిక వెన్నెల
Comments
Please login to add a commentAdd a comment