నా భర్త మృతిపై నిగ్గు తేల్చండి
డాబాగార్డెన్స్: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసిన నాట్రా తాతారావు మృతిపై నిజాలు వెలికితీయాలని అతని భార్య బంగారమ్మ డిమాండ్ చేశారు. డాబాగార్డెన్స్‌లోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 2017 జూలై 11న కొంత మంది తాతారావును హత్య చేయించి, ప్రమాదవశాత్తు చనిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశారని.. కుళ్లిన మృతదేహాన్ని మూటకట్టించి జూలై 15న కేజీహెచ్ మార్చురీ నుంచి తమకు పంపించారని ఆమె ఆరోపించారు. అదే నెల 28న తాతారావు మృతిపై అనుమానాలున్నాయంటూ నగర పోలీసు కమిషనర్, స్టీల్‌ప్లాంట్ యాజమాన్యానికి లేఖ రాశారన్నారు. స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం, పోలీసులు ఎందుకు నాటకాలు ఆడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. చివరకు తాతారావు మృతిలో ఎటువంటి అనుమానాలు లేవని పోలీసు కమిషనర్ ఉక్కు యాజమాన్యానికి స్పష్టం చేశారని, దీని వెనుక పెద్ద కుట్ర జరిగిందన్నారు. తన భర్త మృతికి గల కారణాలు తెలియవని చీఫ్ ఫ్యాక్టరీస్ ఇన్‌స్పెక్టర్ చెబుతుండగా.. తాతారావు మృతి ప్రమాదవశాత్తు జరిగింది కాదంటూ ఉక్కు యాజమాన్యం మరోలా చెబుతోందన్నారు. విధులు నిర్వహిస్తుండగా తన భర్త చనిపోకపోతే మృతదేహాన్ని స్టీల్‌ప్లాంట్‌లో 27 మీటర్ల ఎత్తులోకి ఎవరు తీసుకొచ్చారని ప్రశ్నించా రు. కుటుంబ పోషణకు తన వారసులకు స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కుటుంబ పోషణ కష్టంగా ఉండడంతో ఓ హోటల్‌లో పాచి పనులు చేసుకునే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత సంఘం నేత నిమ్మకూరి రమేష్ మాట్లాడుతూ తాతారావు కుటుంబానికి న్యాయం చేయాలని, ఆయన వారసుడికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమాచార హక్కు చట్టం కార్యకర్త కాసా పద్మ రాజు పాల్గొన్నారు.
స్టీల్ ప్లాంట్ అసిస్టెంట్ మేనేజర్ తాతారావు భార్య బంగారమ్మ వేడుకోలు
పోలీసులు, యాజమాన్య ద్వంద్వ వైఖరితో ఆర్థిక ప్రయోజనాలు కోల్పోయాం
Comments
Please login to add a commentAdd a comment